బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దశబ్దాలుగా ఇండియన్ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఇండియాలోనే రిచెస్ట్ యాక్టర్ గానూ ఎదిగారు. ఇక ఆరు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా.. భారీ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో ‘పఠాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం భారీ యాక్షన్ ఫిల్మ్ Jawanతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించారు. షారుఖ్ భార్య గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. రెండ్రోజుల్లోనే రూ.240 వరకు కలెక్షన్ అందుకోవడం విశేషం.
ఇక ‘జవాన్’ రిలీజ్ సందర్భంగా షారుఖ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. సహజంగా నటీనటులకు పలు సెంటిమెంట్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూ ఓ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. ప్రత్యేకించి కింగ్ ఖాన్ కు నెంబర్ సెంటిమెంట్ ఉందంట. ఆయన కారు కొన్నా.. కొత్త సిమ్ తీసుకున్నా కచ్చితంగా ఆ సంఖ్య ఉండాల్సిందేనంట. ఇందుకు ఉదహరణగా షారుఖ్ కార్లు, ఫోన్ నెంబర్లనే చెబుతున్నారు.
ప్రస్తుతం ఆయన దగ్గరున్న కార్లన్నింటీకి 555 అనే నెంబర్ ఉంటుందంట. అదే షారుఖ్ సెంటిమెంట్ నెంబర్ అని అంటున్నారు. ముఖ్యంగా ఫోన్ నెంబర్ విషయంలో ఆ సంఖ్య ఉండేలా చూసుకుంటారంట. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... ఈ సెంటిమెంట్ ను కుటుంబ సభ్యులు, సిబ్బంది కూడా ఫాలో అవుతుంటారంట.
అగ్రస్థాయి నటుడిగా ఉన్నప్పటికీ షారుఖ్ సెంటిమెంట్ ను పాటిస్తారనేది అర్థమవుతోంది. అలాగే రీసెంట్ గా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని దేవుళ్లను, సంప్రదాయాలను కూడా గౌరవిస్తారని పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే.
ఇక, ‘జవాన్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడిచేస్తోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. ఈసినిమాతోనే బాలీవులోకీ ఎంట్రీ ఇచ్చింది. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో అలరించారు. తెలుగు బ్యూటీ సిరి హన్మంతు కూడా షారుఖ్ పక్కన మెరవడం విశేషం. ఇక చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించారు.