బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖన్ వెంట పడ్డారు నెటిజన్స్. నువ్వేం బాలేవంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆగకుండా ఆమె మీద మీమ్స్ తయారు చేసి ఆడుకుంటున్నారు. అయితే ఈ ట్రోలింగ్ కి సుహానా కూడా ఘాటుగానే సమాధానం ఇస్తోంది.
షారూక్ ఖాన్, గౌరీల కుమార్తె సుహానా ఖాన్ చిన్నప్పటినుండే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే ఆమెకు చాలామంది అభిమానులున్నారు. సుహానా తరచుగా తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.
అయితే ఈ మధ్య కొంతమంది నెటిజన్లు సుహానాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు అంతగా బాగోవంటూ డైరెక్టరుగా కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు రకరకాల మీమ్స్ తయారు చేసి మరీ ట్రోలింగ్ కి తెగబడుతున్నారు.
దీని మీద సుహానా స్పందించింది. ఇప్పుడు సమాజంలో ఉన్న అనేక సమస్యల్లో ట్రోలింగ్ కూడా ఒకటి అన్నారామె. అంతేకాదు ఈ సమస్య నేనొక్కదాన్నే కాదు అనేకమంది ఎదుర్కుంటున్నారని, దీన్ని రూపుమాపాలని చెప్పుకొచ్చారు. నేను అందంగా ఉండడని నెటిజన్లు కామెంట్స్ చేయడం నాకు తెలుసు. అయితే ఇది నాకు కొత్త కాదు పన్నెండేళ్ల వయసు నుండే నేనీ ట్రోలింగ్స్ ఎదుర్కుంటున్నారు.
వాటికి నేనేమాత్రం బాధపడను. పైగా ఇలా ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతో ట్రోల్ చేసేవారికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది. మరి కొందరైతే సూపర్ స్టార్ కూతురా మజాకా.. అందంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న ఈ తరం అమ్మాయి అంటూ మెచ్చుకుంటున్నారు.