Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..

Published : Apr 15, 2026, 09:01 PM IST

రజినీకాంత్ 'జైలర్ 2'ను వద్దనుకున్న బాలీవుడ్ స్టార్ హీరో..  అల్లు అర్జున్ 'రాకా'లో కనిపించబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ కోసం సౌత్ సినిమాలో చేయడానికి ఒప్పకుున్న హీరో ఎవరు? 

PREV
14
అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్..

అల్లు అర్జున్, దీపికా పదుకొణె నటిస్తున్న 'రాకా'లో షారుఖ్ ఖాన్ ఓ కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు షారుఖ్ కూడా చేరితే, పాన్-ఇండియా స్థాయిలో సినిమా రేంజ్ మారిపోతుంది.

'జవాన్' సినిమాతో షారుఖ్, అట్లీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే ఈ సినిమాలో షారుఖ్ గెస్ట్ రోల్ చేయడం దాదాపు ఖాయమంటున్నారు. ఇదే నిజమైతే, అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్‌ను మొదటిసారి ఒకే స్క్రీన్‌పై చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.

 

24
రజినీకాంత్ 'జైలర్ 2'ను ఎందుకు వద్దనుకున్నారు?

రజినీకాంత్ 'జైలర్ 2'లో అతిథి పాత్ర కోసం షారుఖ్‌ను సంప్రదించారు. కానీ, ఆయన ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. దీనికి కారణం ఆసక్తి లేకపోవడం కాదు, తన తర్వాతి సినిమా 'కింగ్' కోసం పక్కా ప్లానింగ్‌తో ఉండటమే.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న 'కింగ్' సినిమా కోసం షారుఖ్ ఓ కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. 'జైలర్ 2' ముందుగా రిలీజ్ అయ్యే అవకాశం ఉండటంతో, అందులో కనిపిస్తే 'కింగ్' లుక్ రివీల్ అయిపోతుందని ఆయన భావించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

34
అబిమానులకు డబుల్ ట్రీట్

'కింగ్' సినిమా 2026 క్రిస్మస్‌కు విడుదల కానుంది. అందుకే షారుఖ్ తన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. 'రాకా'లో ఆయన అతిథి పాత్రను 'కింగ్' లుక్‌కు ఇబ్బంది లేకుండా డిజైన్ చేస్తే, అబిమానులకు డబుల్ ట్రీట్ అవుతుంది.

44
షారుఖ్ - దీపికా జోడీ క్రేజ్..

'ఓం శాంతి ఓం', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'హ్యాపీ న్యూ ఇయర్', 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలతో షారుఖ్-దీపికా జోడీకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ మాస్ అప్పీల్ కూడా తోడైతే, 'రాకా' సినిమా బాలీవుడ్-టాలీవుడ్ మధ్య ఓ అరుదైన సినిమాగా నిలిచిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories