Gautam Tollywood Entry: గౌతమ్‌ హీరోగా ఎంట్రీ.. హింట్‌ ఇచ్చిన మహేష్‌బాబు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

Published : Feb 06, 2022, 08:22 PM ISTUpdated : Feb 06, 2022, 10:32 PM IST

మహేష్‌బాబు.. సూపర్‌స్టార్‌ కృష్ణ వారసత్వాన్ని పునికి పుచ్చుకుని తనో సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు తనకంటూ స్పెషల్‌ ఐడెంటినీ, తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇక తన తనయుడు గౌతమ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయాన్ని తెలిపారు మహేష్‌. 

PREV
17
Gautam Tollywood Entry: గౌతమ్‌ హీరోగా ఎంట్రీ.. హింట్‌ ఇచ్చిన మహేష్‌బాబు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

మహేష్‌బాబు, నమ్రతలకు కుమారుడు గౌతమ్‌, కూతురు సితార ఉన్నారు. గౌతమ్‌ ఇప్పటికే `వన్‌ః నేనొక్కడినే` చిత్రంలో బాల నటుడిగా సినీ రంగప్రవేశం చేశారు. ఇందులో మహేష్‌బాబు చిన్ననాటి పాత్రని పోషించారు. సినిమా పరాజయం చెందడంతో గౌతమ్‌ రోల్‌ హైలైట్‌ కాలేదు. కానీ గౌతమ్‌కి మాత్రం మంచి పేరొచ్చింది. బాగా చేశాడని, అంతా ప్రశంసలు కురిపించారు. 

27

అయితే సినిమా పరాజయం చెందినేమో మళ్లీ సినిమాల వైపు చూడలేదు గౌతమ్‌. మహేష్‌ కూడా ఎంకరేజ్‌ చేయలేదు.  అయితే  ఆ మధ్య సితార ఓ హాలీవుడ్‌ చిత్రంలోని ఓ పాత్రకి తెలుగు డబ్బింగ్‌ చెప్పింది. అది మినహాయిస్తే  పూర్తిగా గౌతమ్‌, సితారలు స్టడీస్‌పైనే ఫోకస్‌ పెట్టారు. సినిమాలకు దూరంగా ఉన్నారు. మరోవైపు సితార మాత్రం యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి అందులో స్టడీస్‌కి సంబంధించిన వీడియోలు, తన గేమింగ్‌, ఇతర యాక్టివిటీస్‌కి సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. తాను మాత్రం భవిష్యత్‌లో సినిమాల్లోకి వస్తానని, నటిని అవుతాననే ఆసక్తిని ఓ ఇంటర్యూలో వెల్లడించింది. 

37

కానీ ఇప్పటి నమ్రతగానీ, మహేష్‌ గానీ తమ పిల్లల భవిష్యత్‌ గురించి ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో నిజంగానే వాళ్లు సినిమాల్లోకి వస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు ఆ చర్చ కూడా లేదు. కానీ తాజాగా సరికొత్త చర్చకి తెరలేపారు మహేష్‌. గౌతమ్‌ గురించి స్పందించారు. గౌతమ్‌ సినిమాల్లోకి వస్తాడనే హింట్‌ ఇచ్చాడు. మహేష్‌బాబు.. బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` షోలో మహేష్‌ పాల్గొన్నారు. మహేష్‌ గెస్ట్ గా షూట్‌ చేసిన ఎపిసోడ్‌తో ఈ షో పూర్తి కానుంది. ఈ ఎపిసోడ్‌ శుక్రవారం నుంచి `ఆహా`లో స్ట్రీమింగ్ అవుతుంది. 

47

ఇందులో ఆసక్తికర విషయాలను వెల్లడించారు మహేష్‌. గౌతమ్‌ క్యాట్‌, సితార బ్రాట్‌ అని, సితార తాట తీసేస్తుందని తెలిపారు. ఇక తన సినిమా కెరీర్‌ గురించి చెబుతూ, స్వతహాగా కథలను ఎంచుకుంటానని, ప్రారంభం నుంచి ఇదే పాటించానని, సినిమా జయాపజయాల క్రెడిట్‌ తనే తీసుకుంటానని, పరాజయం చెందినా అందుకు తానే బాధ్యత వహిస్తానని తెలిపారు మహేష్‌. అంతేకాదు తాను ఇప్పుడు ఎలా ఉంటున్నానో, మున్ముందు గౌతమ్‌ కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు మహేష్‌. 
 

57

ఇలా అనుకోకుండానే మహేష్‌ అసలు విషయాన్ని లీక్‌ చేశారు. గౌతమ్‌ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే అది ఎప్పుడనేది చెప్పలేదు. కానీ గౌతమ్‌ కూడా సినిమాల్లోకి వస్తారనే వార్తతో సూపర్‌ స్టార్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. ఇకపై గౌతమ్‌ వైపు ఫోకస్‌ పెట్టబోతున్నారు. టాలీవుడ్‌లోకి మరో వారసుడు రాబోతున్నారనే విషయం కన్ఫమ్‌ అయ్యిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి కూడా సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

67

ఇదిలా ఉంటే బాలయ్య షోతో మహేష్‌ మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు తన బర్త్ డే నిర్వహించేవారని, వచ్చిన గెస్ట్ లు తనకు వెయ్యి, రెండు వేలు ఇచ్చేవారని, వాటికోసమే తాను ఎదురుచూసేవాడినని తెలిపారు మహేష్‌. కానీ తీరా ఫంక్షన్‌ అయ్యాక ఆ మనీ తన అమ్మమ్మ తీసుకునేదని తెలిపి నవ్వులు పూయించారు మహేష్‌. 

77

ఇక ప్రస్తుతం మహేష్‌బాబు `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇందులో కీర్తిసురేష్‌ కథానాయికగా నటిస్తుండగా, థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా మే 20న విడుదల కాబోతుంది. దీంతోపాటు మూడు రోజుల క్రితమే మహేష్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో పూజా హెగ్దే కథానాయికగా నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories