పూనమ్ వివాదం: రాజకీయ కుట్రగా త్రివిక్రమ్ భావిస్తున్నారా?

First Published Sep 20, 2024, 2:36 PM IST

 ఈ సంవత్సరం అంతా త్రివిక్రమ్ ఇల్లు, ఆఫీస్ దగ్గరే ఉంటున్నారు. దానికి తోడు ఆయన ప్రస్తుతం ఏ సినిమా కూడా చెయ్యకపోవటంతో వార్తల్లో లేరు. 

Trivikram Srinivas


గుంటూరు కారం చిత్రం రిలీజ్ తర్వాత టాప్ డైరక్టర్ , రైటర్ త్రివిక్రమ్ మీడియా ముందుకు వచ్చింది అరుదు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా బాగోలేదంటూ చాలా మంది ఆయన్ను సోషల్ మీడియాలో తిట్టిపోసారు. మహేష్ అభిమానులు సైతం మండిపడ్డారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం అంతా త్రివిక్రమ్ ఇల్లు, ఆఫీస్ దగ్గరే ఉంటున్నారు.

దానికి తోడు ఆయన ప్రస్తుతం ఏ సినిమా కూడా చెయ్యకపోవటంతో వార్తల్లో లేరు. ఇలా సైలెంట్ గా ప్రశాంతంగా నడిచిపోతున్న సమయంలో నటి పూనమ్ ఒక్కసారిగా హఠాత్తుగా ఆయన్ని మీడియాలో హాట్ టాపిక్ గా చేసింది. ఒక్క ట్వీట్ తో మొత్తం మారింది.
 


వాస్తవానికి త్రివిక్రమ్‌తో హీరోయిన్ పూనమ్ కౌర్ గొడవ ఇప్పటిది కాదు. చాలా కాలం నుంచి ఉన్నదే. అవకాసం దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ పై  పూనమ్ విమర్శలు చేస్తూ వచ్చింది. రీసెంట్ గా  మరోసారి అలాంటి కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవొద్దు అని ట్వీట్ చేసింది.

Latest Videos


Poonam Kaur


ఆ  ట్వీట్ పెట్టిన కాసేపటికే త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.

Trivikram


పూనమ్ కు, త్రివిక్రమ్ కు మధ్య ఏం జరిగింది, అసలు విషయం ఏమిటి, త్రివిక్రమ్ ఇప్పుడేం  చేయాలి,   అనే విషయం అయితే బయిటకు రాలేదు. కానీ సోషల్ మీడియా మాత్రం గాసిప్స్ ,స్పెక్యులేషన్స్ తో నిండిపోయింది.

అదే సమయంలో త్రివిక్రమ్ నుంచి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ బయిటకు రాలేదు. తన పేరు ఇంతలా నానుతున్నా ఆయనేమీ మాట్లాడలేదు. విషయం రచ్చ చేయటానికి అవకాసం ఇవ్వలేదనే చెప్పాలి.
 

Poonam Kaur


అయితే ఈ విషయమై త్రివిక్రమ్ స్టాండ్ ఏమిటి...అంటే మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ తన చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతున్నట్లు భావిస్తున్నారట. తను పవన్ కళ్యాణ్ కు బాగా సన్నిహితుడు కావటం, ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటి సీఎం కావటంతో తన రెప్యుటేషన్ దెబ్బతీయటానికి వెనక నుంచి ఎవరో నడిపిస్తున్న కుట్ర అని భావిస్తున్నారట.

అలాగే అసలు ఈ వివాదంలో మెయిన్ టార్గెట్ పవన్ కళ్యాణ్ అని , తనను అడ్డం పెట్టి ఆయన్ను సాధించాలనే ఈ కుట్రగా భావించి సైలెంట్ గా ఉన్నారని చెప్పుకుంటున్నారు. పూనమ్  విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారట.
 

త్రివిక్రమ్ ఇప్పటి వరకూ 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ డైలాగ్ రైటర్‌గా ఆరు నంది పురస్కారాలను అందుకున్న ఆయన.. ఉత్తమ దర్శకుడిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. అలానే భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 లో ఆయనకు బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును ప్రధానం చేసింది.
 

త్రివిక్రమ్ పెన్నుకు పదునెక్కువ.. మాటలకు సూటితనం ఎక్కువ.. అందుకే ఆయన మాటల్లో చమత్కారాలు రాలుతుంటాయి. సామెతలు డొర్లుతుంటాయి. లాజిక్ లు బ్రేక్ డాన్స్ చేస్తుంటాయి. చిట్టి మెదళ్ళు కూడా చిక్కుముడులు విప్పి ఆనందించగలిగే పదాలు చెప్పడంతో త్రివిక్రమ్ సిద్దహస్తుడు. అశ్లీలం లేని..హాస్యం తెరపై చూపించడంతో.. త్రివిక్రమ్ అభినవ జంధ్యాల అనడంలో ఏమాత్రం సందేహం లేదు.  కానీ ఇలాంటి వివాదాలే ఇప్పండి పెడుతూంటాయి ఆయన అభిమానులను

మైత్రి మూవీస్ సంస్థ ఆఫీస్ లో నేడు గ్రాండ్ గా ఈ చిత్రం లాంచ్ అయింది. ఈ చిత్ర లాంచ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు, వివి వినాయక్ లాంటి దర్శకులు అతిథులుగా హాజరయ్యారు. ఇంతమంది అతిథులుగా పవన్ మూవీ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది. కానీ పవన్ స్నేహితులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం హాజరు కాలేదు. 


ఏదైమైనా ఈ  వివాద విషయంలో సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు ఎదురౌతున్నాయి.  పూనమ్ కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్‌.. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసేంత పని ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయలేదు. పూనమ్ కౌర్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనక ఎవరెవరున్నారు? అనేది తెలియాల్సి ఉంది. 

click me!