Bigg Boss Telugu 9:బిగ్ బాస్ తెలుగు షో ప్రతి సీజన్ లో ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 8 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతోంది.
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు షో ప్రతి సీజన్ లో ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 8 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. దీనిపై ఇప్పటి నుంచే అంచనాలు, ఊహాగానాలు, రూమర్స్ మొదలయ్యాయి. తొలి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, సీజన్ 2కి నాని హోస్ట్ గా చేశారు.
25
Vijay Deverakonda Kingdom movie
ఆ తర్వాత మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు. సరదాగా సెటైర్లు వేయాలన్నా, హోస్ట్ గా హుందాగా కనిపించాలన్నా, అవసరమైనప్పుడు కోపం ప్రదర్శించాలన్నా నాగార్జునకే చెల్లింది. అయితే తాజా రూమర్స్ ప్రకారం సీజన్ 9 నుంచి నాగార్జున తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై అధికారిక సమాచారం లేదు. సీజన్ 9కి నాగార్జున హోస్ట్ గా చేయడం లేదని.. బిగ్ బాస్ నిర్వాహకులు విజయ్ దేవరకొండని హోస్ట్ గా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
35
మరి ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ ఏడేళ్ల క్రితమే విజయ్ దేవరకొండ బిగ్ బాస్ షోపై తన ఒపీనియన్ చెప్పేశాడు. అప్పట్లో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి మాట్లాడారు. ఆ టైంలో సీజన్ 2 సాగుతోంది. నాని హోస్ట్ గా చేస్తున్నారు. దీని గురించి యాంకర్ ప్రశ్నిస్తూ నాని బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నారు. ఫ్యూచర్ లో మిమ్మల్ని కూడా బిగ్ బాస్ హోస్ట్ గా చూడొచ్చా అని అడిగారు.
45
నాకు బిగ్ బాస్ షోపై ఆసక్తి లేదు. చూసే టైం కూడా లేదు అని విజయ్ దేవరకొండ తెలిపారు. నాని యాంకరింగ్ గురించి మాట్లాడుతూ.. నాని యాంకరింగ్ సూపర్ గా చేస్తాడు. చూడకపోయినా పరిచయం ఉంది కాబట్టి నాని గురించి తనకి తెలుసు అని విజయ్ దేవరకొండ తెలిపాడు. నేను యాంకరింగ్ చేయలేను. నానిని ఆ విషయంలో బీట్ చేయలేం అని విజయ్ దేవరకొండ ఏడేళ్ల క్రితమే తెలిపాడు.
55
మరి సీజన్ 9కి తన మనసు మార్చుకుని బిగ్ బాస్ హోస్ట్ గా కనిపిస్తాడేమో చూడాలి. నాగార్జున కూడా మొదట్లో తనకి బిగ్ బాస్ షో నచ్చదని చెప్పి ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్ డమ్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.