పెళ్ళాం చేయకూడని పని అక్క చేయవచ్చా... పచ్చిగా ఆ డైరెక్టర్ పై రెచ్చిపోయిన అనసూయ, సెన్సేషనల్ పోస్ట్!

First Published May 19, 2024, 9:39 AM IST

అనసూయ భరద్వాజ్ ఆ స్టార్ డైరెక్టర్ ని వదిలేలా లేదు. సందర్భం ఉన్నా లేకున్నా సోషల్ మీడియా పోస్ట్స్ తో టార్గెట్ చేస్తుంది. తాజాగా చెల్లికో న్యాయం పెళ్లానికో న్యాయమా అని నిలదీసింది. 
 

Anasuya Bharadwaj

నటి అనసూయ భరద్వాజ్ ఇండిపెండెంట్ గా ఉంటుంది. విషయం ఏదైనా తన అభిప్రాయం చెప్పడంలో వెనుకాడదు. ఈ క్రమంలో ఆమెకు సోషల్ మీడియా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి. సోషల్ మీడియా వేధింపులకు అనసూయ భయపడదు. తిరిగి కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. 
 

Anasuya Bharadwaj

కొన్ని సందర్భాల్లో అనసూయ కావాలని వివాదం రాజేసింది. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండను తరచుగా ఆమె టార్గెట్ చేస్తుంది. అతన్ని కించపరిచేలా పరోక్షంగా పోస్ట్స్ పెడుతుంది. అనసూయ తీరు నచ్చని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ అని ట్రోల్ చేస్తూ ఉంటారు. విజయ్ దేవరకొండతో అనసూయ వివాదం ఇప్పటిది కాదు. 
 

Latest Videos


Anasuya Bharadwaj Vijay devarakonda

2017లో అర్జున్ మూవీ విడుదల కాగా... ఆ మూవీ కంటెంట్, డైలాగ్స్, ముద్దు సన్నివేశాలను అనసూయ తప్పుబట్టింది. న్యూస్ ఛానల్స్ డిబేట్స్ లో కూర్చుని లెక్చర్లు దంచింది. అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అంటే అనసూయకు సదాభిప్రాయం లేదు. వాళ్ళ పట్ల తన అక్కసు అప్పుడప్పుడు వెళ్లగక్కుతూనే ఉంటుంది. 
 

తాజాగా సందీప్ రెడ్డి వంగకు చురకలు అంటించింది. యానిమల్ మూవీలోని రెండు సీన్స్ షేర్ చేసిన అనసూయ... అబ్బాయిలు భార్య విషయంలో ఇలా, అక్క విషయంలో ఇలా ఉంటారు. హైపోక్రసీ(కపటత్వం).. మీరు నన్ను హిపోక్రైట్ అంటారా? అని కామెంట్ పోస్ట్ చేసింది. 
 

యానిమల్ మూవీలో హీరో రన్బీర్ కపూర్... తన తండ్రి అనిల్ కపూర్ పై అటాక్ చేసిన సొంత బావను చంపేస్తాడు. అనంతరం అక్కకు రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. అదే రన్బీర్ కపూర్ శత్రువు మీద యుద్దానికి వెళుతూ భార్య రష్మిక మందానతో... నేను తిరిగి వస్తానో రానో తెలియదు. నువ్వు మాత్రం మరో పెళ్లి చేసుకోకు, అంటాడు. 

ఒకే వ్యక్తి అక్క విషయంలో ఒకలా... భార్య విషయంలో మరోలా.. ఆలోచించడాన్ని అనసూయ తప్పుబట్టింది. ఇది అప్రస్తుతం అయినప్పటికీ అర్జున్ రెడ్డి చిత్ర దర్శకుడైన సందీప్ రెడ్డి వంగను మరోసారి ఆమె టార్గెట్ చేసింది. 

యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అయితే పలువురు చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు కంటెంట్ ని తప్పుబట్టారు. పురుషాధిక్య సమాజాన్ని ప్రోత్సహించేదిగా ఉంది. మితిమీరిన వైలెన్స్ అని గగ్గోలు పెట్టారు. ఎన్ని విమర్శలు వచ్చినా... సందీప్ రెడ్డి వంగ తన చిత్రాన్ని సమర్ధించుకున్నారు.. 

click me!