నరేష్ నటి పవిత్ర లోకేష్ పెళ్లి జరగలేదు సహజీవనం చేస్తున్నారు... స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ అసలు నిజాలు!

Published : Jun 30, 2022, 06:53 AM ISTUpdated : Jun 30, 2022, 12:23 PM IST

నటుడు నరేష్ నాలుగో వివాహం చేసుకున్నారన్న న్యూస్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. కొన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. అదే సమయంలో ఇద్దరూ మహాబలేశ్వర్ లో ఓ స్వామిజీ మఠాన్ని సందర్శించారు. వరుస సంఘటనల నేపథ్యంలో నరేశ్, పవిత్ర రహస్య వివాహం చేసుకున్నారనే పుకార్లు వెలువడ్డాయి.

PREV
17
నరేష్ నటి పవిత్ర లోకేష్ పెళ్లి జరగలేదు సహజీవనం చేస్తున్నారు... స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ అసలు నిజాలు!

అయితే పవర్ మీడియా కన్నడ నరేష్(Naresh), పవిత్ర లోకేష్ రిలేషన్ పై  స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. సదరు మీడియా ప్రతినిధి పవిత్ర లోకేష్ ని నేరుగా కలిసి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. కాగా పవిత్ర లోకేష్ వెల్లడించిన నిజాలు సంచలనం రేపుతున్నాయి. 

27
Naresh- Pavitra Lokesh

నరేష్ తో తాను సహజీవనం చేస్తున్నట్లు పవిత్ర (Pavitra Lokesh)తెలియజేశారు.ఈ మొత్తం వ్యవహారం గురించి ఆమె మాట్లాడుతూ....  మేము వివాహం చేసుకోలేదు. అయితే లివింగ్ రిలేషన్ లో ఉన్నాము. మా బంధానికి కృష్ణ ఫ్యామిలీ నుండి ఆమోదం ఉంది. మహేష్ తండ్రి కృష్ణగారితో పాటు నరేష్, నేను ఫార్మ్ హౌస్ లో ఉంటున్నాము. నరేష్ కి మూడో భార్యతో విడాకులు కాలేదు. అందువలనే పెళ్లి గురించి ఆలోచిస్తున్నాం. 
 

37
Naresh- Pavitra Lokesh


నరేష్ చాలా మంచివారు. మోసం చేస్తున్నట్లు అనిపించరు. అబద్దాలు ఆడరు. ఆయనతో నా జీవితం సంతోషంగా ఉంది. నాకు నరేష్ తోడు ఉంటే చాలు. అంతకు మించి నాకు ఎలాంటి డిమాండ్స్ లేవు. 
 

47
Naresh Pavitra Lokesh

నా మొదటి భర్తగా ప్రచారం అవుతున్న సుచేంద్ర ప్రసాద్ ని కూడా నేను వివాహం చేసుకోలేదు. ఆయనతో నేను సహజీవనం చేశాను. పెళ్లి కాలేదు కాబట్టి విడాకుల ప్రస్తావనే లేదు. సుచేంద్రతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో నాకు ఇంకా మంచి రిలేషన్ ఉంది. అప్పుడప్పుడు వాళ్లతో మాట్లాడతాను.

57
Ramya raghupathi


నరేష్ మూడో భార్య రమ్య ప్రవర్తన సరిగా ఉండేది కాదు. నేను ఆమెను కొన్నాళ్లు గమనించాను. భర్త నరేష్ తో ఉండడానికి ఆమె ఇష్టపడలేదు. ఆమె సరిగ్గా ఉంటే నరేష్ కుటుంబం ఆమెకు మద్దతుగా ఉండేది. ఆమె ప్రవర్తన, స్వభావం నాకు నచ్చలేదు. ఆమెకు కొన్ని సమస్యలు ఉన్నాయి... అంటూ పలు విషయాలు పవిత్ర లోకేష్ ఓపెన్ గా చెప్పారు. 

67

సో.... పవిత్ర, నరేష్ కలిసి సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకొని తనకు ఎలాంటి చట్టబద్దమైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదని పవిత్ర లోకేష్ పరోక్షంగా తెలియజేశారు.ఇక వీరి రిలేషన్ కి సూపర్ స్టార్ కృష్ణ మద్దతు ఉందని చెప్పడం విశేషం.

77


కాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తనపై వస్తున్న ఆరోపణలు ఖండించారు. నరేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నరేష్ కావాలనే తనపై దుష్ప్రచారం చేయిస్తున్నాడు. కరోనా కారణంగా నేను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లకు సకాలంలో ఇవ్వలేకపోయాను. నరేష్ నాకు ఇవ్వాల్సిన మైంటెనెన్సు విషయంలో అస్పష్టత ఉంది. నరేష్ కి నేను విడాకులు ఇవ్వలేదు. ఆయన నాలుగులో పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.  

click me!

Recommended Stories