సలార్ మూవీలో యష్?... అదిరిపోయే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్!

Published : Jun 29, 2022, 11:12 PM ISTUpdated : Jun 30, 2022, 12:18 PM IST

పాన్‌ ఇండియా స్టార్స్ ప్రభాస్‌, యష్‌ కలిసి సినిమా చూస్తే ఊహకందని విధంగా ఆ సినిమా ఉండబోతుందని చెప్పొచ్చు. అలాంటి సంచలనం చోటు చేసుకోబోతుంది. దాదాపు ఖరారైంది. 

PREV
18
సలార్ మూవీలో యష్?... అదిరిపోయే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్!

`బాహుబలి`తో సంచలనాలు సృష్టించారు ప్రభాస్‌(Prabhas). వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమా సత్తాని, టాలీవుడ్‌ సత్తాని చూపించారు. ఆ తర్వాత `సాహో`తో తన రేంజ్‌ చాటుకున్నారు. ఇప్పుడు మూడు బిగ్గెస్ట్ మూవీస్‌తో వరల్డ్ సినిమాని షేక్‌ చేసేందుకు వస్తున్నారు. `సలార్‌`(Salaar), `ఆదిపురుష్‌`(Adipurush), `ప్రాజెక్ట్ కే` (Project K) పాన్‌ ఇండియ స్థాయిని దాటి ఉండబోతున్న సినిమా కావడం విశేషం. 

28

మరోవైపు `కేజీఎఫ్‌` (KGF) చిత్రాలతో రికార్డులు క్రియేట్‌ చేశారు యష్‌(Yash). `కేజీఎఫ్‌ 2`(KGF2) సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇది `ఆర్‌ఆర్‌ఆర్‌`నే దాటేసింది. `కేజీఎఫ్‌2`తో యష్‌ ఇండియన్‌ బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు. యష్‌ ఇప్పుడొక బ్రాండ్‌గా మారిపోయారు. కన్నడ సినిమా స్టాండర్డ్స్ ని అమాంతం పెంచేశారు. 
 

38

ఇదిలా ఉంటే ప్రభాస్‌, యష్‌ (Prabhas-Yash) కలిసి నటిస్తే చూడాలనేది అభిమానుల కోరిక. కానీ ఈ ఇద్దరు కలిస్తే మాత్రం బాక్సాఫీసు షేక్‌ అయిపోవాల్సిందే. సంచలనాలకు కేరాఫ్‌గా, అంచనాలకు ఆకాశమే హద్దుగా మారబోతుంది. ఊహకందని కాంబినేషన్‌ ఇది. ఇదొక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌. సౌత్‌ లోనే దీన్ని మించి మరోటి ఉండదని చెప్పొచ్చు. అయితే అలాంటి సంచలనాలకు తెరలేపబోతున్నారు. ఈ ఇద్దరు కలిసి ఒకే తెరపై కనిపించబోతున్నారట. లేటెస్ట్ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

48

అందుకు `సలార్‌` సినిమా వేదిక కాబోతుందట. ప్రభాస్‌.. ప్రస్తుతం `కేజీఎఫ్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel)తో `సలార్‌` చిత్రంలో నటిస్తున్నారు. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కోల్‌ మైనింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సలార్‌ అనే యోధుడి కథతో ఈ చిత్రం సాగబోతుందని, సలార్‌ కార్మికుల నాయకుడిగా ఉండబోతున్నారని తెలుస్తుంది. 
 

58

`సలార్‌`లో యాష్‌ని నటింప చేయాలని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నారట. ఇటీవల ప్రభాస్‌, యష్‌ కాంబినేషన్‌లో ప్రశాంత్‌ నీల్‌ ఓ భారీ ప్రాజెక్ట్ కి ప్లాన్‌ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. మరో రెండు మూడు సినిమాల తర్వాత ఈ కాంబినేషన్‌ ఉండబోతుందంటూ వార్తలొచ్చాయి. కానీ అంతకంటే ముందే `సలార్‌`తో అభిమానుల కోరికని తీర్చబోతున్నారట. ప్రభాస్‌ హీరోగా రూపొందే `సలార్‌`లో యష్‌ చేత గెస్ట్ రోల్‌ చేయించాలని భావిస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌. 

68

ప్రస్తుతం ప్రభాస్‌, యష్‌ కాంబినేషన్‌ సెట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించి యష్‌తోనూ చర్చలు జరుపుతున్నారట. మరోవైపు మేకర్స్ తోనూ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారట. ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్‌ సెట్‌ అయినట్టే అని, యష్‌ గెస్ట్ గా `సలార్‌` లో కనిపించడం ఖాయమంటున్నారు. బలమైన అతిథి పాత్రలో యష్‌ కనిపిస్తారట. ప్రభాస్‌,యష్‌ ఒకేసారి తెరపై కనిపించే సన్నివేశాలు నెవర్‌ బిఫోర్‌ అనేలా, ఊహకందని విధంగా ఉండబోతున్నాయని, ఆ స్థాయిలో ప్రశాంత్‌ నీల్ ప్లాన్‌ చేశారని టాక్‌. 
 

78

ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇదే సెట్‌ అయితే `సలార్‌` ఇండియన్ సినిమాలోనే మరో సెన్సేషనల్‌ ప్రాజెక్ట్ కాబోతుందని చెప్పొచ్చు. అదొక సంచలనాలకు కేరాఫ్‌గానూ నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక `సలార్‌`ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. 

88

 యష్‌ నటించిన `కేజీఎఫ్‌2` ఏప్రిల్‌లో విడుదలై సుమారు 1200కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత యష్‌ మరో సినిమా ఇంకా ప్రకటించలేదు. నార్తన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.  ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు వినిపించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories