బిగ్ బాస్ షణ్ముఖ్ ఒడిలో ఒదిగిపోతూ... నా లవ్ షన్ను తో అంటున్న దీప్తి సునైన, విరహ వేదనతో అల్లాడిపోతున్న పాప!

First Published Sep 11, 2021, 2:33 PM IST

దీప్తి సునైన ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె వరుసగా షణ్ముఖ్ తో కూడిన రొమాంటిక్ వీడియోలు షేర్ చేస్తున్నారు.

దీప్తి సునైనా, షణ్ముఖ్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా కాలంగా ప్రచారం అవుతుంది. పలు వెబ్ సిరీస్లలో ఈ జంట కలిసి నటించారు. అలాగే బుల్లితెర కార్యక్రమాల్లో కలిసి నటించేవారు ఈ జంట. 


ప్రేమ తరువాత బ్రేకప్ వార్తలు కూడా గుప్పు మన్నాయి. దీప్తి, షణ్ముఖ్ మధ్యన చెడిందని, వీరిద్దరూ తమ లవ్ బాండ్ కి బ్రేకప్ చెప్పారని, కథనాలు వెలువడ్డాయి. అయితే తాము ప్రేమికులం అని కానీ, విడిపోయామని కానీ ఎప్పుడూ.. వీరు ఓపెన్ కాలేదు. 

కాగా వీరిద్దరి కాంబినేషన్ లో మలుపు పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన టీజర్ ని దీప్తి సునైన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకున్నారు. పూర్తి వీడియో 16న విడుదల కానుంది... అని తెలియజేయడమే కాకుండా.. విత్ లవ్ షణ్ముఖ్ అంటూ కామెంట్ పెట్టారు. 


మలుపు ఫిల్మ్ లో షణ్ముఖ్, దీప్తి రొమాన్స్ లో రెచ్చిపోయారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. మరోవైపు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన షణ్ముఖ్ ని దీప్తి సునైనా బాగా మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. 


బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5న ప్రారంభమైంది. ఈ సీజన్ కి ఎంపికైన 19మంది కంటెస్టెంట్స్ లో షణ్ముఖ్ ఒకరు. బిగ్ బాస్ హౌస్లోకి వెళితే బయట బంధాలతో సంబంధాలు ఉండవు. దీనితో షణ్ముఖ్ ని దీప్తి బాగా మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. 

బిగ్ బాస్ సీజన్ 3లో దీప్తి సునైన సైతం పాల్గొన్న విషయం తెలిసిందే. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దీప్తి సునైనా చాలా కాలం హౌస్ లో ఉన్నారు. బిగ్ బాస్ ఎంట్రీ ఆమె కెరీర్ కి ఎంతో కొంత బూస్ట్ ఇచ్చింది. 

click me!