వెండితెరపై జయప్రద తనకంటూ ఓ ముద్ర వేశారు. భరతనాట్యంలో నిష్ణాతురాలైన జయప్రద(Jayaraprada)70-80 లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. రెండు తరాల స్టార్ హీరోలతో నటించిన ఘనత ఆమె సొంతం. దేవత, సాగర సంగమం, మేఘ సందేశం వంటి క్లాసిక్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. అలాగే యమదొంగ, అడవిరాముడు వంటి కమర్షియల్ హిట్స్ ఆమె ఇచ్చారు.