Published : Jun 29, 2022, 04:27 PM ISTUpdated : Jun 29, 2022, 04:30 PM IST
ముంబయి బ్యూటీ సాయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) పేరు ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ‘మేజర్’తో మంచి సక్సెస్ అందుకుంది సాయీ. అయితే ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ కొన్నినెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ నటుడు, దర్శకుడు మంజ్రేకర్ కూతురే సాయీ మంజ్రేకర్. అందం, అభినయం కలిగిన సాయీకి వరుసగా సినిమాలు ఆఫర్లు దక్కుతున్నాయి. తన సొంతంగా సినీ అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీపైనే దర్శకనిర్మాతల కళ్లు ఉన్నాయి.
28
సాయీ మంజ్రేకర్ 2012లోనే మరాఠి ఫిల్మ్ తో బిగ్ స్క్రీన్ పై మెరిసింది. ఆ తర్వాత 2019లో బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ (Salman Khan) నటించిన ‘దబాంగ్ 3’తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీలో ఖుషీ అనే పాత్రతో ఆడియెన్స్ ను అలరించింది.
38
తర్వాత డైరెక్ట్ హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన ‘గని’ చిత్రంలో నటించింది. ఈ మూవీ పెద్దగా ఆడియెన్స్ ను ఆకట్టుకోకపోవడంతో సాయీకి పెద్దగా ఎలాంటి గుర్తింపు రాలేదు. కానీ బాలీవుడ్ స్టార్ యాక్టర్ కూతురుగా సాయీకి చాలానే పాపులారిటీ వచ్చింది.
48
తెలుగులో తన రెండో సినిమాగా వచ్చిన ‘మేజర్’ (Major)తో సాయీకి సాలిడ్ హిట్ పడింది. మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ బయోగ్రాఫికల్ ఫిల్మ్ లో టాలెంటెడ్ హీరో అడివి శేషు (Adivi Sesh) సరసన నటించింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.
58
మేజర్ హిట్ తో సాయీకి మంచి గుర్తింపు దక్కింది. మరోవైపు దర్శక నిర్మాతల చూపు ప్రస్తుతం సాయీ మంజ్రేకర్ పైనా ఉన్నాయి. పైగా ఈ ముద్దుగుమ్మ Majorలో ఏకంగా ముద్దుసీన్లలో నటించడంతో యూత్ కు మరింతగా కనెక్ట్ అయ్యింది. అలాగే పాత్రకు తగ్గట్టుగా సాయీ నటన ఉండటం విశేషం.
68
రెండో సినిమాతోనే ఏకంగా లిప్ లాక్ చేసిందంటే.. మున్ముందు ఈ హీరోయిన్ ఆడియెన్స్ ను ఎలా సర్ ప్రైజ్ చేయనుందోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైన అందం, అభినయంలో సాయీకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. మున్ముందూ మరిన్ని సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.
78
ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయీ మంజ్రేకర్ సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకునే పనిలో బిజీగా ఉంది. ఈమేరకు ఎంతటి సాహసమైన చేస్తోంది. ప్రస్తుతానికి లేటెస్ట్ ఫొటోషూట్లతో నెటిజన్లకు దగ్గరవుతోంది. ఈ క్రమంలో ఏకంగా అవుట్ డోర్ ఫొటోషూట్ చేసింది. మేజర్ మూవీ తర్వాత మంచి క్రేజ్ వచ్చినప్పటికీ జనాల్లో నార్మల్ గా తిరిగేస్తోంది.
88
తాజాగా ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎల్లో చూడీదార్ లో సాయీ మంజ్రేకర్ అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తోంది. మూవీలో కాస్తా బోల్డ్ గా కనిపించినా.. బయట మాత్రం చాలా సంప్రదాయంగా కనిపిస్తోంది. ట్రెడిషనల్ వేర్ తో కుర్రాళ్ల గుండెల్ని దోచుకుంటోంది.