సరోగసిని బ్యాన్ చేయాలి.. నయనతారకి కవలలు పుట్టిన వేళ సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Published : Oct 10, 2022, 10:52 AM IST

నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసిన వీరిద్దరూ ఎట్టకేలకు మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకలో దంపతులయ్యారు.

PREV
17
సరోగసిని బ్యాన్ చేయాలి.. నయనతారకి కవలలు పుట్టిన వేళ సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు సహజీవనం చేసిన వీరిద్దరూ ఎట్టకేలకు మహాబలిపురంలో జరిగిన వివాహ వేడుకలో దంపతులయ్యారు. నయనతార సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా, విగ్నేష్ శివన్ ప్రతిభగల దర్శకుడిగా కొనసాగుతున్నారు. 

27

పెళ్ళై నెలలు కూడానా గడవకముందే నయన్ , విగ్నేష్ జంట ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ ట్విస్ట్ తో కొందరు అభిమానులు స్వీట్ షాక్ కి గురైతే , మరికొందరు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆదివారం రోజు నయన్, విగ్నేష్ జంట తమకి కవల పిల్లలు జన్మించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కవల అబ్బాయిలకు నయన్ విగ్నేష్ తల్లిదండ్రులు అయ్యారు. 

37

ఇదెలా సాధ్యం అంటూ నెటిజన్లు తలలు బాదుకుంటున్నారు. సెలెబ్రిటీల విషయంలో ఇది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ కాదు. నయన్, విగ్నేష్ సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు అయినట్లు తెలుస్తోంది. అద్దె గర్భం.. అంటే మరో మహిళ గర్భంతో వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. 

47

చాలా మంది సెలెబ్రిటీలు ఇదే విధానంలో తల్లి దండ్రులు అవుతున్నారు. ప్రియాంక చోప్రా, మంచు లక్ష్మి, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ లాంటి సీలెబ్రిటీలు అంతా సరోగసి విధానం ద్వారా పిల్లల్ని కన్నారు. ఇది సెలెబ్రిటీలలో ఒక ట్రెండ్ గా మారిపోయింది. సెలెబ్రిటీలు సరోగసి విధానం ఎంచుకోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ కెరీర్ కి గర్భం అడ్డు కాకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. 

57

అయితే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. నయనతారకి కవలలు పుట్టిన వేళ సీనియర్ హీరోయిన్ కస్తూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె చేసిన సంచలన ట్వీట్ వైరల్ గా మారింది. 'సరోగసి విధానం ఇండియాలో ఆల్రెడీ బ్యాన్ చేయబడింది. దీని గురించి త్వరలోనే మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. 

 

67

కొన్ని అనివార్య ఆరోగ్య కారణాలు ఉంటే తప్ప ఈ విధానాన్ని అనుసరించకూడదు. ఈ ఏడాది జనవరి నుంచే ఇది చట్టం చేయబడింది. కస్తూరి ఈ ట్వీట్ నయనతారని ఉద్దేశించే చేసింది అంటూ కొందరు ఆమెని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరికొందరు ఈ విషయాన్ని ధైర్యంగా చెబుతున్నారు అంటూ సపోర్ట్ చేశారు. 

 

77

నీ పని నువ్వు చూసుకో అంటూ ట్రోల్ చేస్తున్న వారికి కస్తూరి ధీటుగానే బదులిచ్చింది. నన్ను విమర్శించే వాళ్లకు ముందు లా తెలిసి ఉండాలి. నేను అన్ని వివరాలు తెలుసుకునే ఈ కామెంట్స్ చేశాను. నా లెక్కలు నాకు ఉన్నాయి. నిస్వార్థంగా నా గళం వినిపిస్తున్నాను అంటూ కస్తూరి ట్వీట్ చేసింది. 

click me!

Recommended Stories