`జయం` తర్వాత `ప్రాణం, `నాగ`, `దొంగ దొంగది`, `లీలా మహల్ సెంటర్`, `అవునన్నా కాదన్నా`, `చుక్కల్లో చంద్రుడు`, `వీరభద్ర`, `క్లాస్‌మేట్స్, `టక్కరి`, `మైత్రి` చిత్రాలతో తెలుగులో మెరిసింది. ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీకి పెద్దగా విజయాలు దక్కలేదు. `జయం`, `ప్రాణం`, `అవునన్నా కాదన్నా` చిత్రాలు తప్ప మరేది ఆడలేదు. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలో ఆమె తమిళం, కన్నడ వైపు మొగ్గు చూపి అక్కడ రాణించింది. గత నాలుగైదేండ్లుగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ రాణించేందుకు ప్రయత్నిస్తుంది.