మెమరీ లాస్ తో బాధపడుతున్నానంటూ.. సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఆవేదన ..?

Published : Feb 05, 2023, 08:26 AM ISTUpdated : Feb 05, 2023, 08:34 AM IST

సీనియర్ హీరోయిన్ భానుప్రియ సంచలన విషయాలు వెల్లడించారు. తను సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో వివరించారు. షాకింగ్ నిజాలు చెప్పారు. 

PREV
17
మెమరీ లాస్ తో బాధపడుతున్నానంటూ..  సీనియర్ హీరోయిన్  భానుప్రియ ఆవేదన ..?

తన నటనతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది హీరోయిన్ భానుప్రియ. ఆర్ట్ మూవీస్ తో పాటు..కమర్షియల్ మూవీస్  కూడా చేసిన భాను ప్రియా.. తన కంటితోనే హావభావాలు పలికించేది. తన కెరీర్ లో ఎక్కువ సక్సెస్ రేట్ తో దూసుకుపోయిన ఈ సీనియర్ స్టార్.. ఆతరువాత కూడా క్యారెక్టర్ రోల్స్ తో సందడి చేసింది. 
 

27

భానుప్రియ అంటే చాలు.. 80, 90స్ కిడ్స్ కు ఆమె  అందమైన ఆమె కళ్లు గుర్తొస్తాయి ..నెమలిలాంటి భాను ప్రియ నాట్యం గుర్తుకు వస్తుంది. కెమెరా ఫ్రేములకు  సైతం దొరకని ఆమె వేగం గుర్తొస్తుంది. హీరోయిన్ గా దాదాపు దశాబ్ధానికి పైగా స్టార్ హీరోయిన్ గా తెలుగు తెరను ఒక ఊపు ఊపేసింది భాను ప్రియ. 
 

37

అంతే కాదు డాన్సర్ గా కూడా భాను ప్రియకు మంచి పేరు ఉంది. హీరోయిన్ గా కెరీర్ ముగిసిన తరువాత కొన్ని రోజులు తెరకు దూరం అయిన భానుప్రియ..ఆతరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాబిజీగా గడిపిన ఆమె.. గత కొద్ది కాలంగా సినిమాల్లో కనిపించడం మానేసింది. 

47
bhanupriya

తాజా ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది. తనకు మెమరీ లాస్ ఇబ్బంది ఉన్నట్టు ఆమె వెల్లడించింది. భాను ప్రియ మాట్లాడుతూ.. మావారు చనిపోయారు  అప్పటి నుంచి నేను ఇబ్బందుల్లో పడ్డాను. ముఖ్యంగా ఆరోగ్యం పాడయ్యింది..  మెమరీ లాస్ అయ్యాను అంటూ ఆమె వెల్లడించినట్టు తెలుస్తోంది. సినిమాల్లో నటించకపోవడానికి కూడా ఇదే ఇబ్బంది కారణంగా తెలుస్తోంది. 

57

డైలాగ్స్ కూడా గుర్తుండటం లేదు. డాన్స్ కి సంబంధించిన ముద్రలు కూడా గుర్తుండకపోవడంతో.. డాన్స్ విషయంలో కూడా తాను వెనక్కి తగ్గినట్టు వెల్లడించింది.   అందువల్లనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన  డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకున్నట్టు వెల్లడించింది భాను ప్రియ. అంతే కాదు  ప్రస్తుతానికి తాను మెడిసిన్స్ తీసుకుంటున్నట్టు తెలిపారు

67

అంతే కాదు తన కుటుంబంపై గతంలో రకరకాల రూమర్స్ వచ్చాయి.. మావారు చనిపోవడానికి ముందు నేను .. ఆయన విడిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు అన్నారు. విదేశాల్లో ఉన్న  ఆయన ఇక్కడికి వస్తుండేవారు .. నేను అక్కడికి వెళుతూ ఉండేదానిని. విడివిడిగా ఉండేవారమనేది పుకారు మాత్రమే అన్నారు భాను ప్రియ. 

77

అంతే కాదు ప్రస్తుతం భాను ప్రియ కూతురు అభినయం లండన్ లో పై చదువులు చదువుకుంటున్నట్టు తెలిపింది స్టార్ యాక్ట్రస్. తన వారసురాలిని సినిమాలవైపు తీసుకువచ్చే ఆలోచన లేదు అంటోంది. ముందు తనకు సినిమాల్లోకి రావడానికి ఇంట్రెస్ట్ లేదంటుంది భానుప్రియ. 
 

click me!

Recommended Stories