Saindhav Movie Review : వెంకటేష్ సైంధవ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. వెంకిమామ యాక్షన్ ట్రీట్ లో మైనస్ అదే.. ?

First Published | Jan 13, 2024, 6:23 AM IST

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన సినిమా సైంధవ్. ఆయనకి ఇది 75వ చిత్రం. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈసినిమాలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈమూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్.. ఎవరికి వారు రివ్యూలు ఇస్తున్నారు ట్వీట్టర్ లో. ఇంతకీ వారు ఏమంటున్నారంటే..? 
 

చేసిన ప్రతీసినిమాను సక్సెస్ వైపు నటిపిస్తూ వస్తున్నాడు సీనియర్ హీరో.. విక్టరీ వెంకటేష్.  ఇక ఈసారి కాస్త డిఫరెంట్ గా ట్రై చేశాడు వెంకి మామ.  విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  'సైంధవ్' సినిమా ఈరోజు (13 జనవరి) రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక అంతకు ముందు  అమెరికాలో ప్రీమియర్స్ సందడిచేయగా.. ఈసినిమా చూసిన జనాలు ట్విట్టర్ లో రివ్యూలు ఇస్తున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారు చూద్దాం. 
 

ఈసినిమా సూపర్ హిట్ అంటూ పాజిటీవ్ రివ్వ్యూస్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా వెంకటేష్ యాంక్టింగ్ కు ఎక్కువ మార్కులు పడుతున్నాయి. వెంకి మామ అదరగొట్టాడు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మూవీ కేకపుట్టించాడు.. ఇక సెకండ్ హాఫ్ లో ఫైట్స్ అయితే సూపర్.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈసినిమాలో ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అవుతారు అంటూ ట్వీట్ చేశారు. 


Saindhav Trailer

ఇక మరో ట్వీట్ లో ఇది స్టైలీష్ యాక్షన్ డ్రామా..మూవీ బాగుంది కాని డ్రామా పార్ట్ మాత్రం ప్లాట్ గా ఉంది అంటూ  ట్వీట్ చేశారు. అంతే కాదు ఈసినిమాకు బిగ్గెస్ట్ మైనస్ సంగీతం అంటున్నారు ట్విట్టర్ జనాలు. సినిమా కనెక్ట్ అవ్వాల్సిన చోట.. బీజియం బాగా పనిచేయాలి. కాని ఈమూవీ మ్యూజిక్ వల్ల అదిజరగలేదు. 

వెంకి మామ ఫెర్ఫామెన్స్ అద్భుతంగాఉంది. యాక్షన్ కాని..సెంటిమెంట్ కాని ఆయన నటనకువంకలు పెట్టాల్సిన అవసరం లేదు. కాని మూవీలో మిగతా విషయాలన్నీసాధారణంగానే ఉన్నాయి. పెద్దగాప్రభావం చూపించే విధంగా లేవు అంటూ ట్వీట్ చేశారు మరోఅభిమాని. 

saindhav

ఇంట్రవెల్ ట్వీస్ట్ బాగుంది.. వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్.. నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్.. కాని ఫస్ట్ హాఫ్ అంతా ప్లాట్ నారేషన్ అంటూ ట్వీట్ చేశారు నెటిజన్.. అంతే కాదు సెకండ్ హాఫ్ బాగుంది యాక్షన్ సీక్వెన్స్ లు అదరగొట్టారు. క్లైమాక్స్ కూడా అదిరిపోయింది అంటూ ట్వీట్ చేశారు.

సైంధవ్ రోల్ లో వెంకీమామ అదరగొట్టేశారు. తిరుగులేనినటనప్రదర్శించాంటూ వెంకీ పెర్ఫామెన్స్ పైనే ఎక్కువగా ట్వీట్ లు వెలిశాయి. వెంకటేష్ వన్ మ్యాన్ షో సూపర్ అని, ఫ్యాన్ బాయ్ డైరెక్షన్ అంటే ఇలా ఉండాలని శైలేష్ కొలను మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో  పాప పాత్ర కూడా అద్భుతం అనిచెప్పాలి. ఆ బేబి కూడా బాగా నటించింది, హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.   కాకపోతే కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది అంటున్నారు. 
 

మొత్తానికి పాజిటీవ్, నెగెటీవ్ కలయికలో సైంధవ్ రివ్యూలు నడుస్తున్నాయి. మరి ఈరోజు రిలీజ్అయిన తరువాత తెలుస్తుంది ఈమూవీకి కలెక్షన్స్ వస్తాయా..? ఆడియన్స్ ఆదరిస్తారా..? సంక్రాంతి బరిలో ఉన్న గుంటూరు కారం,హనుమాన్, నాసామి రంగ సినిమాలను దాటుకుని ఈమూవీ ముందుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. 

Latest Videos

click me!