ఈరోజు ఎపిసోడ్ లో మల్లీ మీరు ఇప్పుడు సింధూరాన్ని నా నుదుటిన పెట్టి స్థానం, నా హక్కులు నాకు ఇస్తాను అన్నట్టుగా చెబుతున్నారు, ఆ విషయం నాకు అర్థమైంది అంటుంది మల్లీ. మీరు పెట్టిన ఆ సింధూరాన్ని నేను ఇక్కడ అందరి ముందు పెట్టుకోలేను. ఎందుకంటే నేను ఇక్కడ అందరికీ పెళ్లి కానీ మల్లీ గానే తెలుసు ఇప్పుడు నుదుటి సింధూరం పెట్టుకుంటే వాళ్లు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేవు అంటుంది మల్లీ. అప్పుడు అరవింద్ మనం నిజం అనే అగ్నిపర్వతాన్ని దాచిపెడుతున్నాం, కానీ ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. అప్పుడు జరిగేది ఏదో ఇప్పుడే జరుగుతుంది ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడే వెళ్లి అందరికీ నిజం చెప్పేద్దాము.