చీరకట్టులో మెరిసిపోతున్న హోమ్లీ బ్యూటీ.. చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటున్న సీనియర్ నటి!

First Published | Jan 14, 2023, 5:49 PM IST

హోమ్లీ బ్యూటీ స్నేహా (Sneha) ప్రస్తుతం తన కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. హీరోయిన్ గా అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కీలక పాత్రల్లో మెప్పిస్తోంది. మరోవైపు నెట్టింట దర్శనమిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
 

కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో వెలుగొందింది సీనియర్ హీరోయిన్ స్నేహ. స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులకూ బాగానే దగ్గరైంది. ‘తొలి వలపు’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అందాల తార ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో నటించింది. 
 

తెలుగు, తమిళం, కన్నడలో హీరోయిన్ గా తన సత్తా చాటిన స్నేహా.. ప్రస్తుతం కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో చివరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామా’లో వదిన పాత్రలో మెప్పించింది.
 


మరోవైపు సోషల్ మీడియాలోనూ స్నేహా తెగ సందడి చేస్తోంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ వారికి మరింత దగ్గరవుతోంది. ఈ క్రమంలో అదిరిపోయే ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది.
 

స్నేహా లేటెస్ట్ ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిందీ బ్యూటీ.  దీంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా స్నేహాకు విషెస్ తెలుపుతున్నారు. ఆమెను పొగుడుతూ ఫొటోలకూ లైక్స్, కామెంట్లు పెడుతున్నారు.
 

లేత గులాబీ రంగు చీరలో దర్శనమిచ్చిన స్నేహా తన బ్యూటీతో కుర్రాళ్లను సైతం తనవైపు తిప్పుకుంటోంది. చీరకే అందం తెచ్చే  సొగసుతో కట్టిపడేస్తోంది. చెక్కు చెదరని సౌందర్యంతో కలవరపెడుతోంది. చిరు నవ్వుతో, అదిరిపోయే పోజులతో నెటిజన్ల గుండెల్ని కొల్లగొట్టింది. 

ఇక బుల్లితెరపైనా తమిళ డాన్స్ రియాలిటీ షోలతోనూ అలరించింది. 2012లో చెన్నైలో ప్రసన్నతో స్నేహా పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా స్నేహా కేరీర్ కు దూరంగా కాలేదు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తోంది. ప్రస్తుతం మలయాళంలో ‘క్రిస్టోఫర్’ చిత్రంలో నటిస్తోంది.

Latest Videos

click me!