చిరంజీవి - దాసరి నారాయణరావు గొడవ.. మధ్యలో మోహన్ బాబు పాత్ర ఏంటంటే..?

First Published | Oct 27, 2024, 9:28 PM IST

మెగాస్టార్ చిరంజీవి.. దాసరి నారాయణ రావు, మోహన్ బాబు.. వీరి బంధం గురించి అందరికి తెలిసిందే. వీరి మధ్య కోల్డ్ వార్ గురించి కూడా తెలిసిందే. దాసరి, చిరంజీవి మధ్య మోహన్ బాబు పాత్ర ఏంటో ఓ సందర్భంలో ఆయనే స్యయంగా వెల్లడించారు. 

బ్రతికున్నంత కాలం ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దదిక్కులా ఉన్నారు దాసరి నారాయణరావు. పరిశ్రమకు ఎంత పెద్ద కఫ్టంవచ్చినా.. ఆయన గుమ్మం తోక్కాల్సిందే. ఇండస్ట్రీకి ఏం కావాలన్నా.. ఆయన మాత్రమే చేయగలరన్న పేరు ఉండేది. ఇక దాసరి మరణం తరువాత ఆ పోస్ట్ గురించి చాలా గొడవలు జరిగాయి. మోహన్ బాబు దాసరి స్థానంలో ఉండాలనకున్నారన్నది టాలీవుడ్ టాక్. 

Also Read: పృధ్వీతో కలిసి విష్ణు ప్రియకు నరకం చూపించి.. నిఖిల్ తో పులిహోర కలుపుతున్నయష్మి.

అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం చిరంజీవిని పెద్ద దిక్కుగా భావించాయి. దాంతో ఈ చిరాకులు పడలేని చిరంజీవి మాత్రం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండలేను కాని.. తెలుగు సినీ పరిశ్రమ బిడ్డగా ఏ సమస్య వచ్చినా ముందుంటా అన్నారు. ఇక ఇప్పటికీ టాలీవుడ్ సమస్యలు తీరుస్తూ.. బాగోగులు చూస్తూ.. పెద్దన్నలా మారారు చిరంజీవి. 

Also Read: స్టార్ హీరో కోసం 7 రోజులు ఉపవాసం చేసిన శ్రీదేవి..ఇంతకీ ఎవరా హీరో..?


అయితే దాసరి బ్రతికున్నటైమ్ లో చిరంజీవితో మనస్పర్ధలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇక దాసరి ప్రియశిష్యుడు మోహన్ బాబు తో కూడా చిరంజీవికి ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. పైకి బాగానే మాట్లాడుకున్నా.. లోపల మాత్రం కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. మా ఎలక్షన్స్ విషయంలో కూడా ఎంత రాద్దాంతం జరిగిందో చూశాం. 

ఇక ఏపీ సీఎం ను కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మోహన్ బాబుకు ఆహ్వానం అందకపోవడంపై కూడా పెద్ద చర్చే జరిగింది. ఇక గతంలో  చిరంజీవికి దాసరికి మధ్య మనస్పర్ధలకు కారణం ఏంటి అని మోహన్ బాబును ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో అడిగారు హోస్ట్. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. వారి మధ్య అంత పెద్ద ఇష్యూస్ ఉన్నాయని తాను అనుకోవడం లేదు అని అన్నారు. 

Also Read:ఎన్టీఆర్ – కృష్ణ మ‌ధ్య టైటిల్ వార్.. కొడుకుల కోసం కొట్లాడుకున్న స్టార్ హీరోలు..? చివరికి గెలిచింది ఎవరు..?

ఉండొచ్చు.. కాని ఏం ఉన్నాయి అనేది మాత్రం నాకు తెలియదు అని మోహన్ బాబు సమాధానం నుంచి తప్పించుకున్నారు. కాని ఇప్పుడు తాను చిరంజీవి బాగానే ఉంటామని కూడా అన్నారు మోహన్ బాబు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పేప్రయత్నం చేశారు. గతంలో జరిగిన ఈ ఇంటర్వ్యూతాలుకు వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

కాగా కొన్నేళ్ళ క్రితం జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవికి అందించబోయిన లెజండరీ అవార్డ్ ను అడ్డుకున్నారు మోహన్ బాబు. తాను లెజండరీ నటుడిని కానా. అని ప్రశ్నించారు.ఇండస్ట్రీలో చాలామంది లెజండరీ నటులు ఉన్నారని.. అన్నారు. దాంతో మెగాస్టార్ ఆ అవార్డ్ ను తీసుకోలేదు. అలానే ఉంచారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఏదో ఒక రూపంలో పోటీ నడుస్తూనే ఉంది. కలిసినప్పడు మాత్రం పంచు్ లు వేసుకుంటూ సరదాగా గడుపుతారు మోహన్ బాబు చిరంజీవి. 

Latest Videos

click me!