మీరా జాస్మిన్ రీఎంట్రీ.. పదేండ్ల తర్వాత తెలుగు వారిని పలకరించబోతున్న సీనియర్ నటి!

First Published | Feb 15, 2023, 2:21 PM IST

సీనియర్ నటి మీరా జాస్మిన్ (Meera Jasmine) పదేండ్ల తర్వాత మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ విడుదలైంది. 

టాలెంటెడ్ అండ్ సీనియర్ నటి మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకున్నారు. హీరోయిన్ గా తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా.. తనదైన ముద్ర వేసుకున్నారు. నటన, గ్లామర్ తోనూ ఆడియెన్స్ లో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 
 

పెళ్లి తర్వాత కొన్నేండ్లుగా తెలుగు ప్రేక్షకులకు దూరంగానే ఉన్నారు. సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించాక మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈక్రమంలో పదేండ్ల తర్వాత మళ్లీ తెలుగు ఆడియెన్స్ ను పలకరించబోతున్నారు. 
 


ఈరోజు మీరా జాస్మిన్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ తన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీరా జాస్మిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. 2013లో విడుదలైన ‘మోక్ష’ చిత్రంతో చివరిగా మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులను అలరించారు.
 

‘విమానం’ అనే చిత్రంతో ఇన్నాళ్లకు మళ్లీ మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో మీరా జాస్మిన్ ఎలాంటి పాత్రలో నటించబోతున్నారనేది ఆసక్తిగా మారింది. బైలింగ్వుల్ గా తెరకెక్కుతోంది. ఇక మీరా జాస్మిన్ ఈఏడాదితో 40వ ఏటా అడుగుపెట్టింది. 
 

కేరళకు చెందిన మీరా జాస్మిన్ కొన్నేండ్లు తమిళం, మలయాళం చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. దాంతో మరిన్ని గుర్తుండిపోయే సినిమాల్లోనూ అవకాశం అందుకున్నారు.  

తన తొలిచిత్రం ‘అమ్మాయి బాగుంది’, తర్వాత ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’, ‘పందెంకోడి’ వంటి సినిమాలతో అలరించారు. కేరీర్ బాగున్న సమయంలోనే 2014లో దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ అనే ఇంజినీర్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సెకండ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్నారు. 

Latest Videos

click me!