చిరంజీవి కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ మధ్య బయటపడ్డ విబేధాలు... కోల్డ్ వార్ షురూ!

Published : Feb 15, 2023, 01:15 PM ISTUpdated : Feb 15, 2023, 01:18 PM IST

శ్రీజ-కళ్యాణ్ దేవ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. వాలెంటైన్స్ డే వేదికగా గొడవలు బయటపడ్డాయి. 

PREV
17
చిరంజీవి కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ మధ్య బయటపడ్డ విబేధాలు... కోల్డ్ వార్ షురూ!
Sreeja-Kalyan Dev

శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడివిడిగా ఉంటున్నారు. మనస్పర్థలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇద్దరిలో ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు. ఒకప్పుడు కళ్యాణ్ దేవ్ మామయ్య చిరంజీవి ఇంట్లో ఉండేవాడు. గొడవలు అయ్యాక ఆయన తన ఇంటికి వచ్చేశాడు. శ్రీజ-కళ్యాణ్ దేవ్ ల కూతురు నవిష్క తల్లి వద్దే పెరుగుతుంది. 
 

27
Sreeja Konidela


శ్రీజతో కళ్యాణ్ దేవ్ సమస్య ఏమిటీ? ఏ కారణంగా గొడవలు తలెత్తాయి? అనే విషయంలో స్పష్టత లేదు. వ్యక్తిగత విషయాలు కావడంతో బయటకు రాలేదు. అయితే ఒకరిపై మరొకరు కోపంగా ఉన్నారని తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా కోల్డ్ వార్ నడుస్తున్నట్లు స్పష్టత వచ్చింది. వాలెంటైన్స్ డే నాడు వారి సోషల్ మీడియా పోస్ట్స్ అతిపెద్ద చర్చలు దారితీశాయి. 
 

37
Sreeja-Kalyan Dev

కళ్యాణ్ దేవ్... 'ఒకరిని ఎంత ఇష్టపడ్డాం అనేది కాదు, ఎలా ట్రీట్ చేశాం అనేది ముఖ్యం..' అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశాడు. దానికి కౌంటర్ గా శ్రీజా 'ఒకరి ప్రేమించడం అంటే అర్థం మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేలా చేసుకోవడం కాదు. తమని తాము ఎక్కువగా ప్రేమించబడేలా చేయాలి. ప్రేమను గుర్తించాలి. ప్రతిచోటా దాని కోసం వెతక కూడదు' అని శ్రీజా ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కామెంట్ పెట్టారు. 
 

47


కళ్యాణ్ దేవ్ సందేశం ప్రకారం... శ్రీజా తన పట్ల సరిగా వ్యవహరించలేదు. గౌరవం ఇవ్వలేదని పరోక్షంగా చెబుతుంది. దానికి సమాధానం చెబుతున్నట్లు శ్రీజా పోస్ట్ ఉంది. నా ప్రేమను గుర్తించలేకపోయావు. ప్రతి విషయంలో నన్ను ప్రేమించడం లేదని విమర్శించావని చెబుతున్నట్లుగా ఉంది. వారి మధ్య విబేధాలకు కారణం ఈ సోషల్ మీడియా పోస్ట్స్ ఒకింత స్పష్టత ఇచ్చాయి. 

57
Sreeja


కాగా శ్రీజా మూడో వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. అలాగే కళ్యాణ్ దేవ్ కూడా బంధువుల అమ్మాయితో వివాహానికి సిద్ధం అవుతున్నారని పుకార్లు వినిపించాయి. 2016లో చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకున్నారు. శ్రీజకు ఇది రెండో వివాహం. ఓ ఐదేళ్లు వీరి ప్రయాణం సాఫీగానే సాగింది. వివాహమైనప్పటికీ శ్రీజ తండ్రి వద్దే ఉండేవారు. 

67
Sreeja

  చిరంజీవి అల్లుడి హోదాలో కళ్యాణ్ దేవ్ హీరోగా మారాడు. ఆయన మొదటి చిత్రం విజేత ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. 2021లో శ్రీజతో కళ్యాణ్ దేవ్ కి విభేదాలు తలెత్తాయి. శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించారు. 

77
Sreeja Kalyan

  శ్రీజ-కళ్యాణ్ దేవ్ లకు ఒక పాప ఉంది. 2018లో పుట్టిన ఆ పాప పేరు నవిష్క. శ్రీజ వద్దే నవిష్క పెరుగుతుంది. కోర్ట్ ఆదేశాల మేరకు శ్రీజ గార్డియన్షిప్ శ్రీజకు దక్కినట్లు సమాచారం. ఈ క్రమంలో నవిష్కను కళ్యాణ్ దేవ్ బాగా మిస్ అవుతున్నాడట. ఆ విషయం తన సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తెలియజేస్తున్నాడు. 

click me!

Recommended Stories