సీనియర్‌ నటి గౌతమి కూతురు ఎంత అందంగా ఉందో.. హీరోయిన్లని మించిన అందం.. ఇంటర్నెట్‌ షేకింగ్‌

Published : Mar 11, 2023, 03:11 PM IST

సీనియర్‌ హీరోయిన్‌ గౌతమి ఇప్పుడు సినిమాలు తగ్గించారు, చాలా సెలక్టీవ్‌గానే చేస్తున్నారు. కానీ ఆమె కూతురు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుండటం విశేషం. 

PREV
19
సీనియర్‌ నటి గౌతమి కూతురు ఎంత అందంగా ఉందో.. హీరోయిన్లని మించిన అందం.. ఇంటర్నెట్‌ షేకింగ్‌

నటి గౌతమీ 1980, 90లో ఓ ఊపు ఊపింది. ఆమె తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించిన ఈ అందాల భామ పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. ఆమె 1998లో వ్యాపారవేత్త సందీప్‌ భాటియాని వివాహం చేసుకున్నారు. ఏడాదిలో వీరికి ఓ కూతురు పుట్టారు. ఆమెకి సుబ్బలక్ష్మి అనే పేరు పెట్టారు. కానీ ఒక్క ఏడాదిలోనే విడాకులు తీసుకుంది గౌతమి. అప్పట్నుంచి సుబ్బలక్ష్మిని తనే పెంచుకుంటుంది.
 

29

ఆ సుబ్బలక్ష్మి ఇప్పుడు పెద్దదయ్యింది. 24ఏళ్లకి చేరుకుంది. దీంతో అందంలో అమ్మకి కాంపిటీషన్‌ ఇవ్వడమే కాదు, ఇప్పటి హీరోయిన్లకి పోటీగా మారుతుందని చెప్పొచ్చు. ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్లకి మించిన అందంతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సుబ్బలక్ష్మి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్ల అటెన్షన్‌ గ్రాస్ప్ చేస్తున్నాయి. 
 

39

ప్రస్తుతం తల్లి గౌతమి వద్దే ఉంటుంది సుబ్బలక్ష్మి. ఉన్నత చదువులు చదివిన సుబ్బలక్ష్మి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటోలను నిత్యం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. దీంతో ఇప్పుడు ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. 
 

49

ఇందులో సుబ్బలక్ష్మి అందంతో ఆకర్షిస్తుంది. హీరోయిన్లకి ఏమాత్రం తగ్గని అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్లకంటే అందంగా ఉంటూ కనువిందు చేస్తుంది. గ్లామర్‌ షో చేయకపోయినా అంతటి గ్లామరస్‌గా కనిపించడం విశేషం. 

59

అయితే సుబ్బలక్ష్మి ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చూడ్డానికి మాధురీ దీక్షిత్‌లా ఉందని, ఇంకొందరు నటి సుకన్యలా ఉందని అంటున్నారు. అంతేకాదు సినిమాకి మరో మంచి హీరోయిన్‌ దొరికినట్టే అని, హీరోయిన్‌ అయితే మంచి భవిష్యత్‌ ఉంటుందంటున్నారు. 
 

69

 ఇందులో కొన్ని తన తల్లి గౌతమితో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది సుబ్బలక్ష్మి. అందులో తల్లిని మించిపోయిందని చెప్పొచ్చు. అయితే గౌతమి కూడా తన కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సోషల్‌ మీడియాలోనూ ఇలాంటి వార్తలు ఊపందుకున్నాయి. 

79

నిజానికి మూడు, నాలుగేళ్ల క్రితమే ఇలాంటి ఓ వార్త వినిపించింది. తన కూతురుని హీరోయిన్‌గా పరిచయం చేయబోతుందనే వార్తలొచ్చాయి. దీనిపై ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. ఇప్పుడు మళ్లీ ఆమె తెరపైకి రావడంతో హాట్‌ టాపిక్ అవుతుంది. 

89

ఈ లెక్కన అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సెలబ్రిటీ పిల్లలకు ఇలాంటి వార్తలే అవకాశాలు తెచ్చిపెడతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుబ్బలక్ష్మికి ఆఫర్లు వస్తాయా? ఆమె నటించేందుకు సిద్ధమేనా? అనేది మున్ముందు చూడాలి.

99

ఇక గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. కుర్రాళ్లని కట్టిపడేస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories