గుండెల్ని పిండేసే చూపుతో.. కట్టిపడేసే చిరునవ్వుతో.. మతులు పోగొడుతున్న హోమ్లీ బ్యూటీ స్నేహా..

First Published | Mar 11, 2023, 3:02 PM IST

సీనియర్ నటి స్నేహా (Sneha) కుర్ర హీరోయిన్లకే షాకిచ్చేలా నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది.  క్యూట్ అండ్ బ్యూటీపుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. 
 

హోమ్లీ బ్యూటీ స్నేహా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు హీరోయిన్ కాకపోయినా.. తన సౌందర్యం, కట్టుతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. 
 

దక్షిణాది ప్రేక్షకుల్లోనూ స్నేహకు ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. వెండితెరపై గుర్తుండిపోయే పాత్రల్లో మెరిసింది. మెమోరబుల్ సినిమాల్లో నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతమూ కేరీర్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. 
 


మరోవైపు సోషల్ మీడియాలోనూ స్నేహా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ నటి క్రేజీ పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఖుషీ చేస్తోంది. ఇంటర్నెట్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.  
 

అలాగే అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ కట్టిపడేస్తోంది.  కుర్ర భామలకే షాకిచ్చేలా రోజురోజుకు మరింత గ్లామర్ గా తయారవుతూ నెట్టింట దర్శనమిస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మైమరిపిస్తోంది.
 

పింక్ చుడీదార్ లో తాజాగా మరింతగా మెరిసిపోతోంది.  నాలుగు పదుల వయస్సు దాటినా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది. మరోవైపు ఓరచూపులు,  చిరు నవ్వులతో అభిమానుల గుండెల్ని పేల్చేసింది. 

ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో కనువిందు చేస్తున్న స్నేహా... తాజా ఫొటోషూట్ లో మరింత క్యూట్ గా, బ్యూటీఫుల్ గా మెరిసింది. తనదైన శైలిలో ఫొటోలకు ఫోజులిస్తూ కట్టిపడేస్తోంది. మత్తెక్కించే పోజులతో మైమరిపిస్తోంది.

తాజాగా స్నేహ పంచుకున్న ఫొటోలకు మరో సీనియర్ నటి ప్రియమణి సైతం ఫిదా అయింది. స్నేహా అందాలకు మైమరిచిపోతూ.. ‘ఉఫ్’ అంటూ కామెంట్ సైతం చేసింది. మరోవైపు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

కేరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన స్నేహ కీలక పాత్రలు పోషిస్తూ అలరిస్తూ వస్తోంది. తెలుగులో చివరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు వదినగా ‘వినయ విధేయ రామ’లో నటించి మెప్పించింది. ఆ తర్వాత తమిళ, మలయాళంలో సినిమాల్లో చేసింది.

Latest Videos

click me!