తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించిన ఆమని.. అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో.. పెళ్లి చేసుకుని చాలా కాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. ఆమధ్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమని.. మిడిల్ క్లాస్ మదన్ పాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ నలుగురు, మిడిల్ క్లాస్ అబ్బాయి, హలో గురు ప్రేమ కోసమే, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాల్లో నటించారు.