తెలుగు సినిమా ఉన్నంత కాలం సూపర్ స్టార్ కృష్ణ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. తెలుగు సినిమా కొత్త టెక్నాలజీ అంది పుచ్చుకోవడంలో కృష్ణ సాహసోపేత నిర్ణయాలు బాగా ఉపయోగపడ్డాయి. అదే విధంగా కృష్ణ ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. కృష్ణ స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో విజయ నిర్మలని రెండో వివాహం చేసుకున్నారు.
25
కృష్ణకి బెస్ట్ ఫ్రెండ్
అప్పటికే కృష్ణకి మొదటి భార్య ఇందిరా దేవి, పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కృష్ణ రెండో పెళ్లి నిర్ణయం తీసుకోవడంతో పెద్ద సంచలనం అయింది. అయినప్పటికీ కృష్ణ నిర్ణయానికి అప్పట్లో సన్నిహితులు ఎవరూ అడ్డు చెప్పేలేకపోయారు. సూపర్ స్టార్ కృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన మురళి మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు తనకు కోపం, బాధ కలిగాయి అని మురళీమోహన్ తెలిపారు.
35
భార్య, పిల్లలు ఉండగా..
కానీ అప్పటికి నేను ఇంకా హీరోని కాలేదు. నాకు కృష్ణ ఫ్రెండ్ అయినప్పటికీ అది తప్పు అని చెప్పలేకపోయా. మంచి భార్య, పిల్లలు ఉండగా ఇలా చేశాడు ఏంటి అని అనిపించింది. కృష్ణ సతీమణి ఇందిరా దేవి చాలా మంచి వ్యక్తి.
కానీ సినిమా రంగంలో విజయ నిర్మలతో పరిచయం ఏర్పడడం, అది ప్రేమగా మారడం జరిగింది. కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకుంటారు అని అప్పట్లో కమెడియన్ రాజబాబు ముందే గ్రహించారట.
55
వాళ్ళ నిర్ణయమే కరెక్ట్ అంటూ..
కృష్ణ, విజయ నిర్మల పెళ్లి చేసుకోవడం అప్పట్లో తప్పు అని అనిపించినప్పటికీ.. ఆ తర్వాత వాళ్లిద్దరూ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం.. ఇద్దరి కెరీర్ కి బాగా కలసి వచ్చింది. విజయ నిర్మలని దర్శకురాలిగా కృష్ణ బాగా ఎంకరేజ్ చేశారు అని మురళీమోహన్ తెలిపారు.