రష్మిక మందన్న కు 5 నగరాల్లో.. 5 విలాసవంతమైన ఇళ్లు ? నేషనల్ క్రష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Published : Feb 04, 2026, 11:11 AM IST

విజయ్ దేవరకొండతో మూడు ముళ్లు వేయించుకోబోతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ క్రమంలో రష్మిక ఆస్తుల తో పాటు.. ఆమెకు ఉన్న 5 లగ్జరీ ఇళ్ల వివరాలు వైరల్ అవుతున్నాయి. 

PREV
16
విజయ్ దేవరకొండతో పెళ్లి..

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న త్వరలో స్టార్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడబోతుందన్న వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. ఆమె ఆస్తులు, సంపాదనకు సబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న తన ఆస్తులతో మరోసారి వార్తల్లో నిలిచింది రష్మిక. 

టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్న రష్మిక మందన్న ప్రస్తుతం దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఇళ్లను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, గోవా, కూర్గ్‌లలో ఆమెకు ఇళ్లు ఉన్న రష్మిక, ఇటీవల ముంబైలో కూడా ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.

26
ముంబైలో కొత్త ఇల్లు కొన్నస్టార్ హీరోయిన్..

రష్మిక మందన్న గత ఏడాది ముంబైలో ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్‌లో వరుసగా సినిమా అవకాశాలు రావడం.. తరచూ ముంబైకి ప్రయాణించాల్సి రావడంతో అక్కడకు వెళ్లినప్పుడు నివాసం ఉండటానికి ఓ ఇల్లు కావాలని రష్మిక భావించినట్టు తెలుస్తోంది. ఈ ఉద్దేశంతోనే ప్లాట్ కొనాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పనుల నిమిత్తం ముంబైలో ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో, ఆమె అక్కడే ఒక శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

36
ప్రశాంతమైన వాతావరణంలో...

ముంబైలో రష్మిక కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ విశాలంగా ఉండటంతో పాటు ఆకర్షణీయమైన ఇంటీరియర్స్‌తో ప్రత్యేకంగా నిలుస్తోంది. క్రీమ్ రంగు ఆధారిత అలంకరణ, విస్తృతంగా ఏర్పాటు చేసిన ఇండోర్ ప్లాంట్స్ ఈ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంతో ఈ ఇల్లు ఆమెకు పని ఒత్తిడికి దూరంగా ఉండేందుకు అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

46
సొంత ఊరు.. ఇల్లు అంటే ఎంతో ఇష్టం..

ఇక రష్మికకు అత్యంత ప్రత్యేకమైనవి ఆమె కూర్గ్ , గోవా ఇళ్లు. రష్మిక స్వస్థలం కర్ణాటకలోని కూర్గ్. ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ అక్కడే నివసిస్తున్నారు. బాల్యం నుంచి తన జీవితానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో రష్మికకు సొంత ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె ప్రధానంగా పెద్ద నగరాల్లో ఉంటున్నప్పటికీ, కూర్గ్‌తో ఉన్న అనుబంధాన్ని మాత్రం వదలనంటోంది. సమయం దొరికినప్పుడల్లా తన సొంతప్రాంతానికి వెళ్లి.. హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసి వస్తుంటుంది రష్మిక మందన్న.

56
హైదరాబాద్, బెంగళూరులో కూడా..

ఇక అవ్వడానికి కన్నడ అమ్మాయి అయినా.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారింది రష్మిక. అంతే కాదు తెలుగింటి కోడలు కూడా కాబోతోంది. దాంతో ఎక్కువ శాతం ఆమె హైదరాబాద్ లోనే ఉంటోంది. అందుకే ఇక్కడ కూడా ఆమెకు ఓ లగ్జరీ హౌస్ ఉన్నట్టు సమాచారం. 

తన సొంత రాష్ట్రం రాజధాని బెంగళూరు లో కూడా రష్మిక ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిందట. ఇలా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గోవా, కూర్గ్‌లలో 5 విలాసవంతమైన ఇళ్లను కలిగి ఉన్న రష్మిక మందన్న, తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవనంలోనూ ముందుకు సాగుతుంది.

66
రష్మిక మందన్న ఆస్తుల వివరాలు..

ముందుగా రష్మిక మందన్న ఆస్తుల వివరాల గురించి చూస్తే... మీడియా కథనాల ప్రకారం, రష్మిక ఆస్తి విలువ రూ.66 కోట్లు. బ్లాక్‌బస్టర్ సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కోట్లలో సంపాదిస్తుంది నేషనల్ బ్యూటీ. ఒక్కో సినిమాకు 8 కోట్ల వరకూ తీసుకుంటుందట.ఆమె దగ్గర ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories