22 ఏళ్ల వయస్సులో తాను ప్రేమించి పెళ్లాడిన భార్య చనిపోతే మరో పెళ్ళి చేసుకోలేదు. ముగ్గురు పిల్లల్ని తానే తండ్రిగా, తల్లిగా మారి పెంచానంటూ అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో వెల్లడించారు చలపతి. మహిళలంటే తనకు ఎంతో గౌరవం అన్నారు. ఇన్నాళ్లూ నిప్పులా బతికానని, ఈ సోషల్ మీడియా అనే దరిద్రం వచ్చి తనకున్న మంచి పేరును చెడగొట్టందని చలపతిరావు చాలా బాధపడ్డారు.