ధనుష్‌ వదిన.. సెల్వరాఘవన్‌ భార్య గీతాంజలి బేబీ బంప్స్ ఫోటోస్‌ హల్‌చల్‌

First Published | Oct 23, 2020, 5:27 PM IST

తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య, హీరో ధనుష్‌ వదిన గీతాంజలి సెల్వరాఘవన్‌ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. తాజాగా ఆమె బేబీ బంప్స్ తో కూడిన ఫోటోలు పంచుకున్నారు. 

సెల్వరాఘవన్‌ మొదట 2006లో హీరోయిన్‌ సోనియా అగర్వాల్‌ని వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ళకే విడిపోయారు. ఆ తర్వాత గీతాంజలిని ఆయన మ్యారేజ్‌చేసుకున్నారు.
గీతాంజలి తమిళనాడు మాజీ అడ్వకేట్‌ జనరల్‌ పీఎస్‌ రమణ కూతురు. 2011లో సెల్వరాఘవన్‌, గీతాంజలి వివాహం జరిగింది.

వీరికి కూతురు లీలావతి, కుమారుడు ఓంకార్‌ ఉన్నారు.
ఇప్పుడు మూడో సంతాసం కోసం గీతాంజలి, సెల్వరాఘవన్‌ వెయిట్‌ చేస్తున్నారు.
సెల్వరాఘవన్‌ తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ అన్నయ్య అనే విషయం తెలిసిందే.
సెల్వరాఘవనే విభిన్న కథా నేపథ్యంతో కూడిన చిత్రాలను రూపొందించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన రూపొందించిన పలు చిత్రాలకు గీతాంజలి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశారు.
ఇక ప్రస్తుతం ప్రెగ్నెంట్‌తో ఉన్న గీతాంజలి త్వరలో మూడో బిడ్డకి జన్మనివ్వబోతుంది.
ఈ సందర్భంగా తన ఫోటో షూట్‌ ఫోటోలను పంచుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఫోటోలు చూసుకుని `అది నేనేనా` అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
మెరుపు డ్రెస్‌లో గీతాంజలి గార్జియస్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది.
జనవరిలో ఆమె డెలివరి కాబోతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం గీతాంజలి బేబీ బంప్స్ ఫోటోలు సోషల్‌ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Latest Videos

click me!