శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కుబేరా’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కుబేరా’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలై, తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్‌ను రాబట్టింది. ఈ చిత్ర సక్సెస్ తో శేఖర్ కమ్ముల మరోసారి తాను వైవిధ్యమైన దర్శకుడిగా నిరూపించుకున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా లేకుండా తాను నమ్మిన కథని నిజాయతీగా తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల.
25
కొన్ని నెలలు రిలాక్స్ కానున్న శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల కుబేర తర్వాత కొన్ని నెలలు విరామం తీసుకుని, కుటుంబంతో పాటు టీమ్‌తో రీలాక్స్ అయ్యే ప్లాన్‌లో ఉన్నారు. ఆ తర్వాత తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పై పని ప్రారంభించనున్నారు.
35
నాని, శేఖర్ కమ్ముల కాంబినేషన్
సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని నానితో చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ప్రాథమికంగా ఓ భారీ పాన్ ఇండియా చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్లాన్ ఇప్పటికే శేఖర్ కమ్ముల దగ్గర ఉందట. కుబేరా విడుదలకి ముందే నాని, శేఖర్ కమ్ముల కలిసి సమావేశమై సినిమా చేయాలని చర్చించారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇంకా అధికారికంగా ప్రాజెక్ట్ ఖరారు కాలేదు.
నానితో తెరకెక్కించే చిత్రానికి శేఖర్ కమ్ముల మరింత పకడ్బందీగా బలమైన కథ రెడీ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట. దానికి కారణం కుబేరా చిత్రానికి తెలుగు రాష్ట్రాలకు బయట పెద్దగా ఆదరణ రాకపోవడం. అందుకే శేఖర్ కమ్ముల బలమైన అంశాలు ఉండే కథపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
55
శేఖర్ కమ్ముల చిత్రాలు
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీపై టాలీవుడ్‌లో భారీ ఆసక్తి నెలకొంది. రెండు నెలల్లో ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాని చివరగా హిట్ 3 చిత్రంలో నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. మరోవైపు నాని.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ చిత్రంలో నటించాల్సి ఉంది. ఇక శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రం నుంచి టాలీవుడ్ లో ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. హ్యాపీడేస్, ఫిదా, గోదావరి, లీడర్ లాంటి చిత్రాలు శేఖర్ కమ్ములకి దర్శకుడిగా ప్రశంసలు దక్కేలా చేశాయి.