అల్లు అర్జున్ ముందు తేలిపోయిన సల్మాన్ ఖాన్: పాట హిట్టు, డాన్సు ఫట్టు

First Published | Apr 27, 2021, 1:33 PM IST

హిందీలో సీటిమార్ పాట  ప్రేక్షకులను ఎలా అయితే ఆకట్టుకుంటుందో, ఇందులో సల్మాన్ ఖాన్ డాన్స్ స్టెప్స్ కి మాత్రం అదే స్థాయిలో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే చిత్రం వచ్చే నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకేసారి ఓటిటి, థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమాలోని సీటిమార్ పాటను మరల రీక్రియేట్ చేసారు. ఈ పాట యూట్యూబ్ లో దుమ్ము రేగ్గొడుతుంది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే మాస్ బీట్స్ తో చార్ట్ బస్టర్ గా ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ పాటను విడుదల చేస్తూ సల్మాన్ ఖాన్ అల్లు అర్జున్ ని పొగిడేసాడు. ఈ పాటలో అల్లు అర్జున్ డాన్స్, స్టైల్ అద్భుతం అని, ఇలాంటి పాటను అందించినందుకు థాంక్యూ బ్రదర్ అని ట్వీట్ చేసాడు. వెంటనే అల్లు అర్జున్ కూడా సల్మాన్ ఖాన్ గారు థాంక్యూ. మీ నుంచి కాంప్లిమెంట్స్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది అంటూ... చిత్రానికి అల్ ది బెస్ట్ చెప్పాడు.

అయితే హిందీలో సీటిమార్ పాట ప్రేక్షకులను ఎలా అయితే ఆకట్టుకుంటుందో, ఇందులో సల్మాన్ ఖాన్ డాన్స్ స్టెప్స్ కి మాత్రం అదే స్థాయిలో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మన తెలుగువారు అల్లు అర్జున్ డాన్స్ చూసి కంపేర్ చేసి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే అనుకోవచ్చు, కానీ హిందీ బెల్ట్ ప్రేక్షకులు సైతం ఈ పాట డాన్స్ విషయంలో పెదవి విరుస్తున్నారు.
అందునా సల్లు భాయ్ అల్లు అర్జున్ ని మెచ్చుకోవడంతో దీని ఒరిజినల్ని కూడా వారు తెగ చూస్తున్నారు. ఆ పాటలో అల్లు అర్జున్ డాన్స్ కి ఈ పాటలో సల్మాన్ డాన్స్ కి చాలా తేడా ఉంది. అల్లు అర్జున్ ఈ పాటలో డాన్స్ చేయడానికి ప్రాణం పెట్టాడు. తనకు మాత్రమే సొంతమైన స్వాగ్ తో ఈ పాటకు వేరే లెవెల్ లో స్టెప్పులేశాడు. కానీ ఈ విషయంలో సల్మాన్ తేలిపోయాడు.
తెలుగులో శేఖర్ మాస్టర్ ఈ పాటకు కోరియోగ్రఫీ చేస్తే హిందీలో జానీ మాస్టర్ చేసారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్, దేశంలో ది బెస్ట్ డాన్సర్ గా పిలవబడే ప్రభుదేవా మాస్టర్ దర్శకత్వం వహించారు. ఈ లెవెల్ స్టార్ క్రూ ఉన్నప్పటికీ... హిందీలో ఈ పాట డాన్స్ తేలిపోయింది.
50 సంవత్సరాల వయసు దాటిపోయిన సల్మాన్ అల్లు అర్జున్ తో పోటీపడి స్టెప్పులేయలేకపోవచ్చు, కానీ సల్మాన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా అయినా కోరియోగ్రఫీ డిజైన్ చేసుంటే బాగుండేది. మరీ సల్మాన్ చేసిన ఫ్లోర్ మూమెంట్స్ ని చూసి ఈ దేకడం ఏంటిరా బాబు అంటున్నారు ఆడియన్స్. ఇలాంటి స్టెప్పులు పెట్టడం వల్ల కంపారిజన్ లో సల్మాన్ వెనకబడిపోయాడు. సల్మాన్ కి తగ్గట్టుగా స్టెప్స్ ని పెట్టి ఉంటే బాగుండేదనిది ఈ పాటను చూసిన ప్రతిఒక్కరికీ అనిపించే విషయం.

Latest Videos

click me!