రష్మిక మందన్నా.. ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదగడమే కాదు, కళ్లు మూసి తెరిచేలోపు బాలీవుడ్‌లోకి వెళ్లిపోయింది. మూడేళ్లలో మూడు ఇండస్ట్రీలను మార్చేసింది.
ప్రస్తుతం తెలుగులో బన్నీతో `పుష్ప`లో నటిస్తుంది. అలాగే `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో యాక్ట్ చేస్తుంది. హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాలో `మిషన్ మజ్ను`, అమితాబ్ బచ్చన్‌తో `గుడ్‌బై` చిత్రాల్లో నటిస్తుంది.
ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక తాజాగా అభిమానులతో ఇన్‌స్టాలో ముచ్చటించింది. ఇందులో తన వేలికున్న రింగ్ గురించి, విజయ్ దేవరకొండతో సినిమా గురించి, డేటింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
విజయ్ దేవరకొండతో మళ్లీ నటిస్తే చూడాలనుందని, ఎప్పుడు చేస్తారని అడిగిన ప్రశ్నకి ఆ విషయాన్ని విజయ్ నే అడగండి అనితెలిపింది. మంచి దర్శకుడు, కథ వస్తే చేసేందుకు రెడీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపింది.
బాయ్ ఫ్రెండ్ ఎవరూ అంటూ సమాధానం చెప్పలేదు. ప్రస్తుతం షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని, డేటింగ్ చేసేందుకు టైమ్ లేదని తెలిపింది. ప్రస్తుతం ఆ ఆలోచన లేదని పేర్కొంది.
తాను పెట్టుకున్న రింగ్ గురించి చెబుతూ, అది ఫ్యాన్స్ గిఫ్ట్ గా ఇచ్చిందట. `నాపీపుల్స్ ఇచ్చిన గిఫ్ట్. నాకిది చాలా స్పెషల్. ఎప్పుడూ నాతోనే ఉంటుంది` అని పేర్కొంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నానని, `పుష్ప` షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలిపింది. అల్లు అర్జున్ స్వీట్, అండ్ సింపుల్ అని పేర్కొంది. తెలుగులో మాట్లాడి కరోనా జాగ్రత్తలు చెప్పింది.
తన నేటివ్ ప్లేస్ కూర్గ్ తన ఫేవరేట్ ప్లేస్ అని పేర్కొంది. తన ఇంటిని బాగా ఇష్టపడతానని పేర్కొంది. అక్కడ కంఫర్టబుల్‌గా ఉంటానని పేర్కొంది రష్మిక.
పాటపాడమని అడిగితే నో చెప్పింది. ఆ ఒక్కటి అడగకండి. తనకు పాటలు పాడటం రాదని, డాన్సులు చేయమంటే చేస్తానని పేర్కొంది. సింగింగ్ చేయలేనని స్పష్టం చేసింది.
అనవసరమైన విషయాలు తాను మాట్లాడనని, అవసరం మేరకే మాట్లాడతానని, ఒకే విషయాన్ని పదే పదే చెప్పడం, వినడం అసహ్యంగా ఉంటుందని పేర్కొంది రష్మిక మందన్నా.
ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు చేస్తున్నానని, త్వరలో మరో సినిమాకి సైన్ చేయబోతున్నానని తెలిపింది.