సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమా 2013 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది. అన్నదమ్ములుగా ఈ సినిమాలో మహేష్ బాబు వెంకటేష్ నటన ఎంతో అద్భుతం అని చెప్పాలి.
అయితే ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం... అసలు కథలకంటే కూడా.. సీక్వెల్స్, రీమేక్ లు, రీ రిలీజ్ ల ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. ఈక్రమంలోనే.. 2013 లో రిలీజ్ అయ్యి అందరి హృదయాలు గెలిచిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతుండగా.. ఇంత కాలానికి ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు అప్పుడే ఈ సినిమా సీక్వెల్ కు సబంధించి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయట. ఈసినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం పెద కాపు సినిమా హాడావిడిలో ఉన్నాడు. ఈమూవీ రేపు (28 సెప్టెంబర్) లో రిలీజ్ కాబోతోంది. ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి.. ఆతరువాత ప్రొసీడ్ అయితే.. తనకు ఇమేజ్ కూడా బాగా పెరుగుతుంది అని చూస్తున్నాడట.
ఇలాంటి తరుణంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సీక్రెట్ సినిమా గురించి వార్తలు వస్తున్నప్పటికీ పెద్దకాపు ప్రమోషన్లలో పాల్గొన్నశ్రీకాంత్ ఎక్కడ స్పందించి క్లారిటీ ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఈ సినిమా మాత్రం తప్పకుండా వస్తుందంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఒకవేళ ఈ సినిమా సీక్వెల్ చిత్రం వచ్చినప్పటికీ ఈ సినిమాలో మళ్ళీ మహేష్ , వెంకటేష్ నటిస్తారా అన్న అనుమానం ఉంది.
Photo Courtesy: Instagram
ముఖ్యంగా మహేష్ బాబు ఈ సీక్వెల్ సినిమాలో నటిస్తారా..? అని అనుమానం అందరిలో ఉంది. ఎందుకంటే.. బ్రహ్మోత్సవం సినిమాతో శ్రీకాంత్ భారీ డిజాస్టర్ ను అందించాడు. దాంతో మహేష్ ఛాన్స్ ఇస్తాడో లేదో అని అనుకుంటునర్నారు. మరి ఈసినిమాపై క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.