పొట్టి డ్రెస్.. మత్తెక్కించే సిట్టింగ్ పోజులు.. నయా లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న పూనమ్ బజ్వా

First Published | Sep 27, 2023, 4:03 PM IST

కింగ్ నాగార్జున హీరోయిన్ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. మినీ డ్రెస్ లో కిర్రాక్  ఫొటోషూట్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి. 

ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa)  తన సినీ ప్రయాణాన్ని టాలీవుడ్ తోనే ప్రారంభించింది. ‘మొదటి చిత్రం’తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’ వంటి చిత్రాలతో అలరించింది.
 

పూనమ్ బజ్వాకు అక్కినేని నాగార్జున సరసన నటించిన ‘బాస్’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో నయనతారకు ధీటుగా పూనమ్ బజ్వా పెర్ఫామెన్స్ ఇచ్చింది. నటన పరంగానే కాకుండా గ్లామర్ విషయంలోనూ ఆడియెన్స్ కు ఫిదా చేసింది.


అలాగే అల్లు అర్జున్ ‘పరుగు’ చిత్రంలోనూ మెరిసింది. ప్రకాష్ రాజు కూతురి పాత్రలో నటించింది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’లో మెరిసింది. తెలుగులో ఇలా అవకాశాలను దక్కించుకుంది. టాలీవుడ్ లో కంటే తమిళం, మలయాళంలో ఎక్కువ సినిమాలు చేసింది.
 

ఇక రెండేళ్ల నుంచి ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేయడం లేదు. ఆమె నటించిన చిత్రాలూ పెద్దగా ఆడకపోవడంతో క్రమంగా ఆఫర్లూ తగ్గుతూ వచ్చాయి. దీంతో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం పూనమ్ చేతిలో ఎలాంటి సినిమా లేదు.

సినిమాల పరంగా చాలా వెనకబడ్డ పూనమ్ బజ్వా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ తన అభిమానులకు ఖుషీ చేస్తోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ గ్లామర్ విందు కూడా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

డెనీమ్ మినీ ఫ్రాక్ లో పూనమ్ మెరిసింది. మోకాళ్ల వరకు ఉన్న డ్రెస్ లో హాట్ సిట్టింగ్ ఫోజులిచ్చింది. స్లీవ్ లెస్ అందాలతోనూ ఆకట్టుకుంది. బ్యూటీఫుల్ స్మైల్ ఇస్తూ.. మత్తు ఫోజులతో మైమరిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Latest Videos

click me!