నేహా శెట్టి చీరకట్టు చాలు.. కుర్రాళ్లు గాల్లో తేలిపోవాల్సిందే.. రాధిక మత్తు ఫోజులకు మైకమే

First Published | Sep 27, 2023, 4:40 PM IST

‘డీజే టిల్లు’ హీరోయిన్ నేహా శెట్టి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. అదిరిపోయే లుక్ లో దర్శనమిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది.
 

‘మోహబూబా’ చిత్రంతో నేహా శెట్టి (Neha Shetty) టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘గల్లీ రౌడీ’తో అలరించింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోనూ మెరిసింది. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది.
 

గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ డీజే టిల్లు (DJ Tillu)తో మంచి సక్సెస్ అందుకుంది. బ్లాక్ బాస్టర్ మూవీని ఖాతాలో వేసుకుంది. అలాగే తను నటించిన ‘రాధిక’ పాత్రతోనూ ప్రశంసలు అందుకుంది. ఆ రోల్ నేమ్ ఇఫ్పుడు నేహా శెట్టికి మరో పేరులా మారింది.
 


ఇక సోషల్ మీడియాలోనూ నేహా శెట్టి ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం తన చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్న సందర్భంగా గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంటోంది. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. అందాల విందుతోనూ అదరగొడుతోంది. 
 

లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, ప్రింటెడ్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. మత్తు ఫోజులతో మంత్రముగ్ధులను చేసింది. గుచ్చే చూపులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. చిరునవ్వుతో కుర్రాళ్ల హృదయాల్లో అందాల బాణాలు దింపింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

‘డీజేటిల్లు’ ఇచ్చిన సక్సెస్ ను నేహా శెట్టి సరిగా వినియోగించుకోలేదు. ఆ సినిమా తర్వాత తదుపరి చిత్రాలకు బాగా గ్యాప్ ఇచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మ చిన్న సినిమాలకే పరిమితమైంది. ప్రస్తుతం మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఆ సినిమాలు రిలీజ్ కు కూడా సిద్ధమవుతున్నాయి. 
 

కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’తో పాటు, విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నటిస్తోంది. ప్రస్తుతం Rules Ranjann రిలీజ్ కు సిద్ధం అవుతోంది. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ రెండు చిత్రాల నుంచి వరుస అప్డేట్ అందుతున్నాయి. 

Latest Videos

click me!