తనపై వస్తున్న రూమర్స్ పై పూజా హెగ్డే స్పందించినట్లు తెలుస్తోంది. డబ్బు విషయంలో తాను ఎప్పటికీ దిగజారను అని తెలిపింది. నాకు డబ్బే ముఖ్యం అయితే వచ్చిన ప్రతి ఆఫర్ అంగీకరించాలి. కానీ నేను అలా చేయడం లేదు. కథ, తన పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవని తెలిపింది.