సావిత్రి చివరి కోరిక.. తన సమాధిపై ఏం రాయాలని చెప్పిందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

Savitri Last Wish: మహానటి సావిత్రి జీవితం తెరిచిన పుస్తకం. ఆమె గురించి ఎంతో మంది కథలు కథలుగా చెప్పారు. చెబుతూనే ఉన్నారు. `మహానటి` పేరుతో సినిమా కూడా తీశారు. ఆమె ఎలా సినిమాల్లోకి వచ్చింది. ఎలా ఎదిగింది? ఎలా రాజవైభవం చూసింది. ఎలా డౌన్‌ అయ్యింది. చివరికి ఎలా విషాదాంతంగా ఆమె జీవితం ముగిసిందనేది అందరికి తెలిసిందే. కానీ తోడే కొద్ది కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి. ఆమెతో పని చేసినవాళ్లు ఏదో ఒక కొత్త విషయం చెబుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. 
 

Savitri last wish Do you know what she wanted written on her tombstone? in telugu arj
Savitri

Savitri Last Wish: సావిత్రి ఎంత ప్రతిభ ఉందో, అంతే ఇన్నోసెంట్‌ కూడా. గుడ్డిగా అందరిని నమ్మే తత్వం ఆమె జీవితాన్ని తలక్రిందులు చేసింది. మొండి పట్టుదల కూడా జీవితంలో పెద్ద దెబ్బ కొట్టింది. భర్త జెమినీ గణేషన్‌ తనని మోసం చేయడం విషయంలో ఆమె తట్టుకోలేకపోయింది.

దర్శకురాలిగా మారి, నిర్మాతగా మారి బాగా నష్టపోయింది. కొందరు రాజకీయ నాయకుల కుట్రలకు బలయ్యింది. మొత్తంగా తన జీవితం విషాదంగా ముగిసింది. అయితే సావిత్రి చివరి రోజుల్లో తన చివరి కోరిక కోరుకుందట. ఓ జర్నలిస్ట్ వద్ద ఆ విషయాన్ని బయటపెట్టాడు. 

Savitri last wish Do you know what she wanted written on her tombstone? in telugu arj
Actress Savitri

అప్పట్లో సీనియర్‌ జర్నలిస్ట్ గా ఉన్న నందగోపాల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. సావిత్రి చివరి రోజుల్లో తాను చనిపోతే సమాధిపై ఏం రాయాలో ఆమె ముందే చెప్పిందట. మరి ఆమె ఏం చెప్పిందనేది చూస్తే,

`మరణంలోనూ జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతిని పొందుతుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా సానుభూతితో కన్నీళ్లని విడవనక్కర్లేదు. ఈ సమాజంలో ఎవరూ కూడా హీనంగా చూడకుండా మరణం లేని ఈ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకి చిహ్నంగా ఒక పూలమాలని ఉంచండి. ఇదే నాకు మీరిచ్చే గౌరవం` అని సావిత్రి కోరుకున్నారట.

మరి అది తన సమాధిపై రాశారా? లేదా అనేది తెలియదు. కానీ ఆమె చివరి కోరిక ఇదే అని, సీనియర్‌ జర్నలిస్ట్ నందగోపాల్‌ చెప్పినట్టుగా ఓ వార్త ప్రచారం అవుతుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 


Savitri

సావిత్రి మద్యానికి బానిసై అతిగా మద్యం తీసుకోవడం వల్ల కోమాలోకి మరణించిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యం విషయంలో ముందే వైద్యులు హెచ్చరించినా డిప్రెషన్‌, ఆవేశంతో మళ్లీ తాగింది.

దీంతో రెండో సారి ఏకంగా కోమాలోకి వెళ్లింది. కొన్ని రోజులపాటు కోమాలోనే ఉండి తుదిశ్వాస విడిచింది. సావిత్రి చనిపోయినప్పుడు  పెద్ద సెలబ్రిటీలు ఎవరూ ఆమెని కడసారి చూసేందుకు వెళ్లకపోవడం విచారకరం. 
 

Latest Videos

vuukle one pixel image
click me!