ఆ మాటలకు రాధ ఏం సమాధానం చెప్పకుండా కుమిలిపోతూ ఉంటుంది. అప్పుడు రాధ తన మనసులో నా చెల్లెలు గురించి ఆలోచించి నేను ఇలా బయటకు వచ్చాను కానీ నీ గురించి నేను ఆలోచించలేదు అని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య రాధకు ఎంత ఫోన్ చేసినా కూడా రాధా ఫోన్ లిఫ్ట్ చేయదు. దాంతో ఆదిత్య ఏం జరిగిందా అని రాధ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత దేవి, చిన్మయి ఇద్దరు స్కూల్ కి వెళ్తారు.