Rashmika: త్వరలో రష్మిక పొలిటికల్ ఎంట్రీ.. ఎంపీ కావడం ఖాయం... పార్టీ, ప్లేస్ తో సహా చెప్పిన వేణు స్వామి

Published : Jul 23, 2022, 09:27 AM IST

స్టార్ లేడీ రష్మిక మందాన పొలిటికల్ ఎంట్రీపై వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ, ప్లేస్ తో సహా చెప్పిన ఆయన రష్మిక త్వరలో ఎంపీ అవుతారని బల్లగుద్ది చెబుతున్నాడు. వేణు స్వామి లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి.   

PREV
18
Rashmika: త్వరలో రష్మిక పొలిటికల్ ఎంట్రీ.. ఎంపీ కావడం ఖాయం... పార్టీ, ప్లేస్ తో సహా చెప్పిన వేణు స్వామి
Rashmika mandanna


సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై వేణు స్వామి చేసే కామెంట్స్ తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈయనకు పరిశ్రమలో కొంత క్రెడిబిలిటీ కూడా ఉంది. సెలెబ్రిటీలు ఈయన మాటలు నమ్ముతారు. ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. హీరోయిన్ రష్మిక మందాన ఈ వివాదాస్పద వేణు స్వామితో ఓ పూజ నిర్వహించడం జరిగింది. సదరు వీడియో, ఫోటోలు బయటికి రాగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 
 

28
Rashmika mandanna

తాజా ఇంటర్వ్యూలో వేణు స్వామి రష్మిక(Rashmika Mandanna) కెరీర్ తో పాటు పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫలానా పార్టీ నుండి ఎంపీ అవుతారని కుండబద్దలు కొట్టాడు. వేణు స్వామి మాట్లాడుతూ... హైదరాబాద్ లోని రష్మిక నివాసంలో నేను ప్రత్యేక పూజలు నిర్వహించాను. దానితో ఆమె దశ తిరిగింది. ఇప్పుడు ఆమె నేషనల్ క్రష్. సినిమాకు ఆరు నుండి ఏడు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.

38
Rashmika Mandanna


ఆమె జాతకరీత్యా మరింత ఉన్నత స్థాయికి వెళతారు. ఆమె త్వరలో ఎంపీ కూడా అవుతారు. కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె లోక్ సభకు ఎంపిక అవుతారు. ఆమె జాతకంలో ఇది రాసి ఉంది. రష్మికకు ఆ యోగం ఉంది. కాబట్టి రష్మిక త్వరలో ఎంపీ కావడం ఖాయమని వేణు స్వామి కుండబద్దలు కొట్టాడు. 

48


ఏకంగా పార్టీ, ప్లేస్ కూడా చెప్పేసిన వేణు స్వామి కామెంట్స్ వైరల్ గా మారాయి. స్టార్ హీరోయిన్ గా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక పాలిటిక్స్ వైపు వెళ్లడం ఏమిటనీ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి కూడా వేణు స్వామీ కొన్ని కామెంట్స్ చేశారు. 

58


హీరో రక్షిత్ శెట్టి తో రష్మిక విడిపోవడానికి కారణం నేనే అన్నారు. జాతకరీత్యా మీకు సెట్ కాదు, ఆయనతో విడిపోవడం మంచిదని నేను సూచించాను. నా సలహా మేరకు రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం జరుపుకున్న రష్మిక ఆయన నుండి విడిపోయిందని వేణు స్వామి(Venu Swami) తెలియజేశారు. వేణు స్వామి మాటలను బట్టి చూస్తే రష్మిక చాలా గట్టిగా ఆయన్ని నమ్ముతారని తెలుస్తుంది. 

68

ఇక గతంలో నాగ చైతన్య, సమంత విడిపోతారని ముందే చెప్పానని వేణు స్వామి ప్రకటించుకున్నారు. నేను ముందుగా చెప్పినట్లే ఆ జంట విడాకులు తీసుకున్నారని వేణు స్వామి తెలియజేశారు. అలాగే మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ వేణు స్వామి సంచలన కామెంట్స్ చేయడం విశేషం. 
 

78


పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి రాజకీయ భవిష్యత్తు లేదన్న వేణు స్వామి ఆయన నాలుగో వివాహం చేసుకోవచ్చని బాంబు పేల్చారు. ఇక పవన్, శ్రీజా జాతకాలు ఒక్కటే వీరిద్దరి జీవితాల్లో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయని వేణు స్వామి చెప్పడం వివాదాస్పదంగా మారింది. 
 

88


చిరంజీవి(Chiranjeevi) కుమార్తె శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ చాలా కాలంగా ఈ జంట విడివిడిగా ఉంటున్నారు. మరోవైపు శ్రీజ మూడో వివాహం చేసుకోవడానికి సిద్దమయ్యారన్న వార్తలు పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో వేణు స్వామి మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories