ఆఫీస్ కి వెళ్లి ఆఫీస్ పని చేయమన్నాను కానీ ఇంట్లో కూడా ఆఫీస్ పని చేయమని అనలేదు. ఆఫీసులో ఆఫీస్ గురించి ఆలోచిస్తూ,బయట, బయట వాళ్ల గురించి ఆలోచిస్తూ ,ఇంట్లో వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తావు?, నవ్వుతూ, ఆఫీస్ కి వెళ్లి వస్తున్నాను అని మా అందరితో చెప్పి ఎన్ని రోజులైందో గుర్తు తెచ్చుకో ఆదిత్య, ఎంతో ఆశతో అమెరికాకి ట్రీట్మెంట్ కోసం వెళ్దాము అంటే వద్దు అన్నావు.