ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభం లోనే...జానకమ్మ,రాధ ఇంట్లో లేదని ఇల్లంతా వెతుకుతూ తన గదిలోకి వెళ్తుంది. అప్పటికే తన గదిలో తన వస్తువులన్నీ సర్దుకొని ఉంటాయి. అదేంటి ఇంట్లో లేదు వస్తువులన్నీ సర్దుకొనుంది. ఇల్లు కూడా కదలని రాదా ఈరోజు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటుంది. ఇంతలో రాధా భాగ్యమ్మ అక్కడికి వస్తారు. ఎక్కడికెళ్లారు అని జానకమ్మ అడగగా రాధ మౌనంగా ఉంటుంది. అప్పుడు భాగ్యమ్మ,రాధమ్మ దేవితో వేరే ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది, దానికోసం ఇల్లు వెతకడానికి వెళ్ళాము అని అంటాది.