Devatha: ఆనందంలో మాధవ్.. ఆదిత్య, రుక్మిణిలను ఒక దగ్గర చూసి కుళ్ళిపోతున్న సత్య!

Published : Oct 12, 2022, 01:46 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 12వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
18
Devatha: ఆనందంలో మాధవ్.. ఆదిత్య, రుక్మిణిలను ఒక దగ్గర చూసి కుళ్ళిపోతున్న సత్య!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..భాగ్యమ్మ మాధవ్ తి, కళ్ళు నాకు నెత్తికెక్కడం కాదురా నీకు నెత్తికెక్కాయి అని అంటుంది. దానికి మాధవ్ ఏంటి నోరు లెగుస్తుంది అని అనగా,నోరు కాదు చేయి కూడా లెగుస్తాది అసలు రాధ ఎవరనుకుంటున్నావు నా సొంత బిడ్డ.నా బిడ్డ అంత నరకం అనుభవిస్తుంది నీ వల్లే.అది చూస్తూ నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా.నిన్ను ముక్కలు చేసి చేపలకి తిండి పెడతాను అని అంటుంది.దానికి మాధవ్, రాద బాధపడతాది అనిన్ను వదిలిపెట్టను అని అంటాడు.
 

28

అప్పుడు భాగ్యమ్మ కోపంతో,దాని  దాని బాధకి కారణం నువ్వు ఇంకొక్కసారి దాన్ని  తప్పుడు బుద్ధితో చూస్తే జాగ్రత్త అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో ఆదిత్య దేవి కోసం స్కూలు ఎదురుగుండా వస్తాడు. అప్పటికి రామ్మూర్తి పిల్లల్ని స్కూల్ కి దింపుతాడు. ఆదిత్యను చూసిన రామ్మూర్తి పలకరిస్తాడు. జానకమ్మ గారికి ఎలా ఉన్నది అని ఆదిత్య అడగగా, అలాగే ఉన్నది బాబు ఇంక తగ్గడం లేదు మందులు వేస్తున్నాము కానీ ఫలితం లేదు చూడాలి అని చెప్పి చిన్న పని ఉన్నది అని వెళ్ళిపోతాడు.
 

38

 తర్వాత దేవి, చిన్మయి ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఆదిత్యను చూసినా దేవి పలకరించదు. ఏమైందమ్మ దేవి నన్ను చూసిన పలకరించడం లేదు ఎందుకు మాట్లాడవా అని అడిగగా, నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పి దేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో జానకమ్మ ఏడుస్తూ ఉండగా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇక్కడ మీ కొడుకు నన్ను ఇలా బాధలు పెడుతున్నాడు అయినా సరే నేను ఇంట్లో నీకోసం ఉంటున్నాను అని ఏడుస్తున్నావా? నువ్వు అలా బాధపడొద్దు. ఏదిక్కు వెళ్ళాలో తెలియని స్థితిలో నన్ను నువ్వు ఆదరించావు ఇలాంటిది అప్పుడు నిన్ను వదిలి వెళ్తాను అని నువ్వు ఎలాగ అనుకుంటున్నావు.
 

48

 నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నిన్ను వదిలి నేను వెళ్ళను నీకు నయం అవని అప్పుడు చూద్దాం అని అన్నం తినిపిస్తూ ఉంటుంది.ఇదంతా చూసిన మాధవ్ బయటకు వచ్చి రాద అందర్నీ అంత ప్రేమగా చూసుకుంటే ఎంత బాగున్నది, నేను ఇంటి నుంచి వెళ్ళను అన్న మాట ఇంకా బాగుంది. అందర్నీ ఎంత బాగా చూసుకుంటుంది నన్ను అలాగే చూసుకుంటే ఎంత బాగుండేది. రాద నన్ను ఇష్టపడితే నేను రాముడిలా ఉంటాను. కానీ ఒకవేళ కాదన్నాదంటే పది తలల రావణుడిని అవుతాను అని అనుకుంటాడు మాధవ్.ఆ తర్వాత సీన్లో జరిగిన విషయం గురించి బాధపడుతూ సత్య ఏడుస్తూ ఉంటుంది.
 

58

అదే సమయంలో కమల కూతురు ఏడుస్తూ ఉండగా కమలా అక్కడ ఉండదు పాప ఏడుస్తుంటే అక్క ఏది అనుకొని వెళ్లి పాపని లాలిస్తుంది సత్య. అప్పుడు సత్య,సుంటీ పాపకు అక్క పేరు పెట్టారు ఇప్పుడు ఆ పేరు పిలవాలన్నా నాకు అసహ్యంగా ఉన్నది అక్క ఇలాంటి పనులు చేస్తుందని ఆంటీకి తెలిస్తే బాధపడతారు. అక్క పేరు పెట్టి నిన్ను పిలవనీయకుండా చేస్తున్నారు అని పాపతో అంటుంది సత్య. ఆ తర్వాత సీన్లో మాధవ్ జానకమ్మ దగ్గరకు వెళ్లి, నిన్ను చూస్తే నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నది అమ్మ. నువ్వు ఇక్కడ పడిపోయి నాకు మంచి పని చేశావు నీవల్లే రాద ఇంట్లో ఉంటుంది.
 

68

 నువ్వు కథలను అంతవరకు రాద ఎక్కడికి వెళ్ళదు అనే ధైర్యం నాకు వచ్చింది. ఇంక నేను భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎలాగా ఇక్కడి నుంచి లెగకుండా నేను చేస్తాను అప్పుడు రాద చచ్చినట్టు నాతోనే ఉంటుంది అని అంటాడు. వెనకనుంచి ఇదంతా వింటున్న భాగ్యమ్మ, తల్లితోనే ఇలా మాట్లాడుతున్నాడు అసలు వీడికి బుద్దున్నదా వీడి సంగతి ఎలాగైనా చూడాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో ఆదిత్య, రుక్మిణి ఇద్దరూ కలుస్తారు. అప్పుడు ఆదిత్య ని చూసిన రుక్మిణి గతంలో సత్య అన్న మాటలు గుద్దుతెచ్చుకుంటూ, పెనిమిటి కి విషయం చెప్దామా వద్దా? ఒకవేళ చెప్తే ఇద్దరి మధ్య గొడవలు అవుతాయి అని అనుకుంటుంది.
 

78

మరోవైపు ఆదిత్య, దేవి కాదు రుక్మిణి నువ్వు కూడా ఎందుకలా ఉన్నావు ఏమవుతుంది అని అనగా అదే సమయంలో సత్య అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన సత్యని చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. సత్య అక్కడికి చప్పట్లు కొట్టుకుంటూ వచ్చి, బాగున్నది చాలా బాగున్నది. ఒకరెమో, మీ ఇద్దరి మధ్యలో నేను రాను మీ కోసమే నా జీవితాన్ని కూడా త్యాగం చేసి వెళ్ళిపోయాను అని చెప్పి మళ్ళీ సిగ్గులేకుండా నా వెనకాతల నా మొగుడితో మాట్లాడుతారు.
 

88

 ఇంకొకలే నుంచి నాతో తప్ప అందరితోని బయటకు వెళ్తారు ఏవైనా అడిగితే తిరిగి నా మీద అరుస్తారు సరిపోయింది అని అంటుంది. దానికి రుక్మిణి, ఏం మాట్లాడుతున్నావ్ సత్య అని అనగా, నిజం మాట్లాడుతున్నాను అని సత్య అరుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories