అవసరం అయితే నా రక్తంతో రాసి ఇస్తాను.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు

Published : Oct 12, 2022, 01:06 PM ISTUpdated : Oct 12, 2022, 01:08 PM IST

తన కెరీర్ గురించి కాస్త ఘాటుగా స్పందించింది బాలీవుడ్ బ్యూటీ జాన్వి  కపూర్. తను వారసత్వాన్ని చూసుకుని రాలేదంటోంది. తను పెద్ద అందగత్తెను కూడా కాదు అని నిర్మోహమాటంగా చెప్పేస్తోంది. ఇంతకీ జాన్వీ కపూర్. 

PREV
17
అవసరం అయితే నా రక్తంతో రాసి ఇస్తాను.. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు
Janhvi Kapoor

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్.  వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినా.. టాలెంట్ తో ఎదిగే ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. అయినా సరే ఇండస్ట్రీలో నెపొటిజం పేరుతో ట్రోల్స్ తప్పడం లేదు జాన్వీకి.  ఈ విషయంలో రీసెంట్ గా క్లారిటీ ఇచ్చింది జాన్వీ కపూర్. 

27
janhvi kapoor

తన గురించి... చాలా మందిలో దురభిప్రాయం ఉంది అంటోంది జాన్వీ కపూర్. తాను వారసత్వంపై వచ్చి.. స్టార్ డమ పొందాలి అని అనుకోవడం లేదని... అయినా  తానేమీ గొప్ప టాలెంట్ ఉన్న దానిని కాకపోవచ్చని, అలాగే గొప్ప అందగత్తెను కూడా కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. 

37

కాకపోతే.. తాను షూటింగ్ కు వెళ్తే.. సెట్స్ లో కష్టపడి పనిచేస్తానని అంటోంది జాన్వీ. తను కష్టపడే తత్వమే... తనను ఇండస్ట్రీలో నిలబెడుతుదని నమ్ముతున్నానంటోంది జాన్వీ కపూర్. రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జాన్వీ కపూర్  ఈ విధంగా మాట్లాడింది. 

47

శ్రీదేవి, భోనీ కపూర్ వారసురాలిగా..  జాన్వీ కపూర్ 2018లో ధడక్  సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మేకర్ కరణ్ జోహార్ జాన్వీని బాలీవుడ్ తెరకు పరిచయం చేశారు. అయితే తనకు ఈ స్థానం అదృష్టం కొద్దీ వచ్చింది కాదని, అది కూడా అంత సునాయాసంగా రాలేదని ఇంటర్వ్యూలో చెప్పింది జాన్వీ.

57
janhvi kapoor

సెట్ లో తాను ఎంత కష్టపడతాను అనే విషయాన్ని తన  రక్తంతో రాసివ్వడానికి కూడా వెనకాడనంటోంది. అంతే కాదు తన  పనితీరుపై అనుమానమే అక్కర్లేదంటోంది జాన్వీ.  తనకు అదే పనిని మళ్లీ, మళ్లీ చేయడం బోర్ అని చెబుతూ.. తనకంటూ సవాళ్లను పెట్టుకోవాలని లేదంటే, సమయం వృధా అవుతుందని అనిపిస్తోందని జాన్వీ కపూర్ తెలిపింది. 

67

ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ల  లిస్ట్ లో కోనసాగుతోంది జాన్వీ కపూర్. ఆమె సౌత్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని, విజయ్ దేవరకొండ జోడీగా నటించబోతుందంటూ.. రకరకాల మాటలు వినిపించాయి. కాని జాన్వీ కపూర్ తో పాటు ఫ్యామిలీ ఇంత వరకూ కన్ ఫార్మ్ చేయలేదు. 

77

ఇక జాన్వీ కపూర్ చెల్లెలు, ఖుషి కపూర్ కూడా తేరంగేట్రానికి రెడీ అవుతోంది. ఈ ఇద్దరు సోషల్ మీడియాలో తమ శక్తికి మించి స్కిన్ షో చేస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా జాన్వీ కపూర్ హాట్ షోకు నెటిజన్ల మతులు పోతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories