Devatha: రాధ సాయం కోసం వెళ్లిన సత్య.. రుక్మిణి కోసం భాగ్యమ్మ దగ్గరకు వెళ్లిన దేవుడమ్మ!

Published : Jul 30, 2022, 12:19 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జులై 30వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
16
Devatha: రాధ సాయం కోసం వెళ్లిన సత్య.. రుక్మిణి కోసం భాగ్యమ్మ దగ్గరకు వెళ్లిన దేవుడమ్మ!

ఎపిసోడ్ ప్రారంభంలోనే.... సత్య, ఆదిత్య ఇద్దరు వాళ్ళ గదిలో పడుకొని ఉంటారు. ఆదిత్య మాత్రం నిన్న దేవితో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ, "మాధవ్ తనని దేవి నుంచి దూరం చేసేసాడని ఎలాగైనా వాళ్ళని ఇంటికి తీసుకురావాలని" అనుకుంటాడు. సత్య మాత్రం ఈ మధ్య ఆదిత్య తనని పట్టించుకోవడంలేదని, దేవి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాడని ,ఎందుకో బాధపడుతున్నాడని అనుకుంటాది.

26

దాని తర్వాత సీన్లో సత్య రాధ దగ్గరకు వెళ్తాది. ఎప్పుడొచ్చావ్ సత్య? ఏమైంది? అని రాధ సత్యని అడగగా, ఎందుకో బాధ చెప్పుకోవాలి అనిపించింది అక్క అని చెప్పి నిన్న జరిగిన సంఘటన అంతా చెప్పి,"ఆదిత్య ఎందుకో చాలా బాధపడుతున్నాడు. దేవి వాళ్ల కానీ ,నీవల్ల కానీ ఆదిత్య బాధపడే విషయం ఏమైనా జరిగిందా? నీకు తెలిస్తే నాకు చెప్పక్క, నేను బాధపడతానని నా దగ్గర నుంచి దాయకు.దీనికి ఒక పరిష్కారం వెతికి నా సమస్యను పరిష్కరించు.

36

ఆదిత్య బాధపడితే ,నేను చూడలేను"అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాది సత్య. తర్వాత సీన్లో సూరి, రుక్మిణి ఫోటో పట్టుకొని చుట్టు పక్కన ఉన్న వారందరినీ తన గురించి తెలుసేమో అని కనుక్కుంటాడు. కానీ ఎవరూ తెలియదు అనే చెబుతారు. దాని తర్వాత సీన్లో సత్య కారు దిగి ఇంటికి వస్తున్నప్పుడు కొన్ని మంది ఉద్యోగులు సత్యన్ని ఆపి,కొన్ని ఫైల్స్ పట్టుకుని వచ్చి,"ఆఫీసర్ చాలా రోజుల నుంచి ఆఫీస్ కి రావట్లేదు, చాలా ఫైల్స్ పెండింగ్లో ఉండిపోయి, సార్ సంతకం కోసం మేము వచ్చాము" అని చెప్తారు .

46

అప్పుడు సత్య "సార్ ఇంట్లో లేరు. ఇంటికి వచ్చాక నేను సంతకాలు పెట్టిస్తాను" అని ఫైల్స్ తీసుకొని వారిని పంపించేసింది సత్య.ఇంట్లోనీ లేక,ఆఫీస్ లోనీ లేక ఆదిత్య అక్కడికి వెళ్ళాడ? అని సత్య అనుకుంటుంది. ఆదిత్యా, రుక్మిణి దగ్గరకు వెళ్లి ఎందుకు పిలిచావు అడగగా రుక్మిణి" మాధవ్ సార్ నా వెనకాతల ఏదో కథ నడిపిస్తున్నాడు, అదేంటో నాకు అర్థం కావట్లేదు" అని చెప్పి.

56

అలాగే సత్య తన ఇంటికి వచ్చి జరిగిన సంభాషణ అంతా  ఆదిత్య కి చెప్పి 'తనకి నువ్వే ప్రపంచం పెనిమిటి, తనని బాధ పెట్టకుండా చూసుకొని" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుక్మిణి. ఆదిత్య బాధపడుతూ అక్కడే ఉండిపోతాడు.తర్వాత దేవుడమ్మ, భాగ్యమ్మ దగ్గరకు వస్తుంది, వచ్చి "రుక్మిణి బతికే ఉందని పూజారిగారు అంటున్నారు.

66

కానీ ,తను నా దగ్గరకు రావట్లేదు వస్తే ఎక్కడ తన చెల్లెలు కాపురం  చెడిపోతుంది అని భయపడుతుంది,నా దగ్గరికి రాకపోతే, కనీసం మీ దగ్గరకైనా రావాలి కదా భాగ్యమ్మ, వచ్చిందా?నిజం చెప్పు అని అడుగుతుంది.కాని భాగ్యమ్మ  ఏమి చెప్పకుండా అలా ఉండిపోతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే!

click me!

Recommended Stories