Devatha: మాధవ్ ని చంపేసిన సత్య.. చిన్మయికు తల్లిగా రాధ.. ముగిసిన దేవత కథ!

First Published Nov 12, 2022, 8:20 AM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 12వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో దేవుడికి దండం పెట్టుకుంటున్న రుక్మిణి ఆరోజు దారి తెలియక నీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఒక దారి చూపించావు ఇన్నాళ్ళు నువ్వు చూపించిన దారిలోనే నడిచాను. ఇప్పుడు మళ్లీ మీ ముందుకు వచ్చి నిల్చున్నాను నువ్వే దారి చూపించాలని దండం పెట్టుకుంటుంది. అక్కడికి రక్మిణి ని వెతుక్కుంటూ వస్తాడు మాధవ్. దండం పెట్టుకుంటున్న రుక్మిణి ని చూసి తాళి కట్టబోతాడు.నీ మటుకు నువ్వు వెళ్ళిపోతే నేనేం అవ్వాలి అందుకే బలవంతంగా అయినా తాళికట్టేస్తాను అని తాళి కట్టబోతాడు.
 

కళ్ళు తెరిచిన రుక్మిణికి తాళితో కనబడ్డ మాధవ్ని చూసి షాక్ అవుతుంది. ఏం చేస్తున్నారు సార్ మళ్లీమళ్లీ తప్పులు చేయకండి నా దారిన నన్ను వదిలేయండి నా మెడలో నా పెనిమిటి కట్టిన తాళి ఉంది ఈ జన్మకి నేను ఆయనకే భార్యని అని అంటుంది. ఈ జన్మకి నేను చేసే ఆకరి తప్పు ఇదే నేను తాళి కట్టేసిన తర్వాత ఎలాగూ నువ్వు మనసు మార్చుకొని నాతో సంసారం చేస్తావు అని ఆమె మెడలో బలవంతంగా తాళి కట్టబోతాడు. అతని తలపై సత్య దీపపుకుందితో  కొట్టేస్తుంది. మాధవ్ అక్కడికక్కడే రక్తపుమడుగులో పడిపోతాడు. ఏం చేస్తున్నావ్ సత్య అని అడుగుతుంది రుక్మిణి.
 

నన్ను క్షమించు అక్క, నువ్వు చేసిన త్యాగాన్ని కూడా నేను గుర్తించలేకపోయాను నీలాంటి దేవతని అనుమానించాను అని అక్కకి క్షమాపణ చెప్పుకుంటుంది. అంతలో అందరూ అక్కడికి చేరుకుంటారు. చిన్మయి మాధవ్ ని చూసి ఏడుస్తుంది. రక్తపు మడుగులో ఉన్న మాధవిని చూసి అందరూ కంగారు పడతారు ఏమైంది అని అడుగుతారు. నా బ్రతుకు పాడు చెయ్యబోతే  నేనే చంపేశాను అని అబద్ధం చెప్తుంది రుక్మిణి. లేదు అక్క చెప్తుంది అబద్ధం ఉంటుంది సత్య. నువ్వు అబద్ధం అని చెప్తే నిజం అబద్ధం అయిపోదు అని నింద తనమీద వేసుకుంటుంది రుక్మిణి.
 

నువ్వు చంపావా అని ఆశ్చర్యంగా అడుగుతుంది భాగ్యమ్మ. నువ్వు అంటావు కదా అమ్మ ఆన్ని చంపుతా, ఈన్ని చంపుతా అని ఈ పొద్దు నేనే చంపాను అని ఏడుస్తుంది. ఏడుస్తున్న  చిన్మయి ని చేరదీసి, దేవిని, చిన్మయి ని ఇద్దరినీ సత్య చేతిలో పెడుతుంది. వాళ్లని పెంచే బాధ్యత నీదే అని ఆమెకి అప్పగింతలు పెడుతుంది. నేను నీ నుంచి తప్పించుకోవటానికి అబద్ధం చెప్పాను అత్తమ్మ నన్ను క్షమించు. జీవితకాలం నేను నీ కోడల్ని నీ కోడలుగా బ్రతకలేకపోయాను కానీ నీ కోడలు గానే సచ్చిపోతాను అని దేవుడమ్మకి దండం పెడుతుంది. ఇన్నాళ్లు నాన్న, నాన్న అని బాధ పడ్డావు కదా ఇదిగో మీ నాన్న అని తండ్రికి అప్పచెప్పుతుంది దేవిని. నీతో గడిపిన నాలుగు రోజులు నాకు చాలా ఆనందకరమైన రోజులు.
 

వచ్చే జన్మలోనైనా నీ భార్యగా పుట్టి జీవితకాలం నీతోనే ఉండాలని ఉంది అంటుంది. ఇకనైనా నువ్వు సత్య,జీవిత కాలం సంతోషంగా ఉండండి. అందరికీ అప్పగింతలు అప్ప చెప్పి ఆకరి సారిగ ఆదిత్య కాళ్ళకి దండం పెట్టుకుంటుంది రుక్మిణి అప్పుడే అక్కడికి పోలీసులు చేరుకుంటారు. అందరూ ఆమె కోసం ఏడుస్తారు.ఆమెని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిపోతారు. తను లైఫ్ జర్నీ ని తలుచుకొని ఏడుస్తుంది రుక్మిణి. కొన్ని సంవత్సరాల తర్వాత పొలం దున్నుతూ కనిపిస్తుంది రుక్మిణి.

 అటువైపుగా వచ్చిన ఆదిత్య వాళ్ళు ఆమెని చూస్తారు. ఇన్నాళ్లు మీ చెల్లెలు కోసం జీవితాన్ని త్యాగం చేసావు ఇప్పుడు అనాధ అయిన చిన్మయి  కోసం బ్రతుకుతున్నావు. ఎప్పుడు పక్క వాళ్ళ కోసం బ్రతకడం తప్పితే నీకోసం నువ్వు ఎప్పుడు బ్రతకలేదు నువ్వు నిజంగా మనుషుల్లో దేవతవి అని ఆమెను చూసి పొంగిపోతుంది  దేవుడమ్మ. దేవి ఐఏఎస్ చదవడం కోసం తండ్రి ప్రయత్నిస్తుంటాడు. చిన్మయిని పెంచడం కోసం రుక్మిణి కష్టపడుతుంది. ఈ కథ ఇక్కడితో ముగింపు కాదు మరో కథకి ఆరంభం మాత్రమే.

click me!