గ్లామర్ ఫీల్డ్ లో ఎంత సన్నగా ఉంటే అంత మంచిది. సన్నగా నాజూగ్గా ఉండడం కోసం హీరోయిన్స్ కఠిన కసరత్తులు, యోగాసనాలు చేస్తారు. ఇష్టమైన ఫుడ్ కూడా వదులుకొని మితంగా తింటూ కడుపు మాడ్చుకుంటారు. పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండాలంటే తప్పదు మరి. ఒక్కసారి బరువు పెరిగి షేప్ ఔట్ అయితే ఇంకా కెరీర్ ఖతమే. దర్శక నిర్మాతలు చూడను కూడా చూడరు.