సల్మాన్, అక్షయ్, రజినీ... అందరూ ప్రభాస్ వెనుకే... వంద కోట్లు కాదు, ఆయన ప్రజెంట్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!

First Published | Nov 24, 2021, 7:54 AM IST


ప్రభాస్ ఫేమ్ పాపులారిటీ ఎల్లలు దాటేసింది. ఇతర దేశాలలో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న ఈ టాప్ స్టార్ మార్కెట్ దేశవ్యాప్తం అయ్యింది. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మూవీతో బడ్జెట్స్  షాకిస్తుండగా, ఆయన రెమ్యూనరేషన్ మైండ్ బ్లాక్ చేస్తుంది. సల్మాన్, అక్షయ్ కుమార్,రజినీకాంత్ కూడా ఆయన ముందు బలాదూర్ అంటుంది బాలీవుడ్ మీడియా.. 

బాహుబలి సిరీస్ తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టిన ప్రభాస్ అతిపెద్ద స్టార్ గా Prabhas ఎదిగాడు. ఆయన సినిమాల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రభాస్ మూవీ చేయాలంటే కనీసం రూ. 400 కోట్లు కావాలి. ప్రభాస్ ప్రస్తుతం ప్రకటించిన చిత్రాల బడ్జెట్ వందల కోట్లుగా ఉన్నాయి.


 
రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె తో పాటు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్న స్పిరిట్  చిత్రాల బడ్జెట్ కలిపితే రూ. 1700 కోట్లకు పైమాటే.  మరి ఈ స్థాయిలో ప్రభాస్ పై పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ముందుకు రావడం ఆయనకు చిత్రాలకు దేశంలో ఉన్న మార్కెట్ చూసే.


బాలీవుడ్ మీడియా కథనాలు ప్రకారం ప్రభాస్ ఆదిపురుష్, స్పిరిట్ చిత్రాల కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నారట. దీనితో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ రెకార్డులకు ఎక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వంద కోట్ల వరకు తీసుకుంటున్న హీరోలుగా రజినీకాంత్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ఉన్నారు. 
 

Rajinikanth


ఎప్పటి నుండో బాలీవుడ్ ని ఏలుతున్న సల్మాన్ ఖాన్(Salman khan) తన రెమ్యునరేషన్ గా వంద కోట్లు తీసుకుంటున్నారు. కొన్నాళ్లుగా అక్షయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. దానితో ఆయన తన లేటెస్ట్ మూవీ బెల్ బాటమ్ కొరకు వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇక రజినీకాంత్ (Rajinikanth)రోబో మూవీ నాటి నుండి వంద కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. 


అయితే రూ. 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో మాత్రం దేశంలోనే ఒక్కరు కూడా లేడు. ప్రభాస్ ఆ రికార్డు బ్రేక్ చేశాడని ఇప్పుడు సమాచారం అందుతుంది. బాహుబలి మూవీ విజయం క్రెడిట్ మొత్తం రాజమౌళికే ఇచ్చిన సినిమా పండితులు, ప్రభాస్ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా స్థాయి విజయం సాధించడం కష్టం అన్నారు. 

అయితే సాహో మూవీ ఆ అంచనాలు తప్పని రుజువు చేసింది. ప్రభాస్ కి మార్కెట్ ఉందని నిరూపించింది. పూర్తి నెగిటివ్ టాక్ తో కూడా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సాహో.. హిందీలో సూపర్ హిట్ కావడం విశేషం. అక్కడ సాహో ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీ జనాలకు సాహో తెగ నచ్చేసింది. 
 


ఇక రాధే శ్యామ్ (Radhe shyam)తో సంక్రాంతి బరిలో దిగిన ప్రభాస్.. 2022 సమ్మర్ కి సలార్ విడుదల చేయనున్నాడు. మరలా ఆగష్టు లో ఆదిపురుష్ విడుదల కానుంది. వచ్చే ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆయన బ్యాక్ టూ బ్యాక్ రిలీజెస్ తో ట్రీట్ ఇవ్వనున్నాడు. 

Also read Akhanda: బాలయ్య `అఖండ` రోర్‌ షురూ.. గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డిటెయిల్స్

Also read షణ్ముఖ్‌ బెడ్‌పై సిరి.. హగ్‌ చేసుకుని క్షమాపణలు.. ఇన్నాళ్లకి రియలైజ్‌ అయ్యిందట..

Latest Videos

click me!