శరత్ బాబు తన ఆస్తికి వారసురాలి కోసం ప్రయత్నించారా, ఎందుకు నెరవేరలేదు.. సోదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : May 24, 2023, 05:14 PM IST

నటుడు శరత్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, ప్రతి నాయకుడిగా వెండి తెరపై ఎన్నో పాత్రలకు జీవం పోశారు. దాదాపు ఐదు దశాబ్దాలు నటుడిగా ప్రస్థానం కొనసాగించిన శరత్ బాబు సోమవారం రోజు మరణించిన సంగతి తెలిసిందే.

PREV
16
శరత్ బాబు తన ఆస్తికి వారసురాలి కోసం ప్రయత్నించారా, ఎందుకు నెరవేరలేదు.. సోదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నటుడు శరత్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, ప్రతి నాయకుడిగా వెండి తెరపై ఎన్నో పాత్రలకు జీవం పోశారు. దాదాపు ఐదు దశాబ్దాలు నటుడిగా ప్రస్థానం కొనసాగించిన శరత్ బాబు సోమవారం రోజు మరణించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న శరత్ బాబు ఆ మధ్యన హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. 

26

ఆరోగ్యం విషమం కావడంతో శరత్ బాబు తిరిగిరాని లోకాలకు వెళ్లారు.వెండి తెరపై వెలుగు వెలిగిన శరత్ బాబు పర్సనల్ లైఫ్ లో మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.  1981లో శరత్ బాబు సీనియర్ నటి రమాప్రభని ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. ఇప్పటికి రమాప్రభ పలు ఇంటర్వ్యూలలో శరత్ బాబుని తీవ్రంగా విమర్శిస్తూ తనకి జరిగిన అన్యాయం తలచుకుని బాధపడుతూ ఉంటుంది. 

36
sarath babu

రమాప్రభ విషయంలో తాను కుర్ర వయసులో తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని.. అసలు తమకు జరిగింది పెళ్లి లాంటిదే కాదు అని శరత్ బాబు సమాధానం ఇవ్వడం చూశాం. అయినప్పటికీ రమాప్రభకి తాను 60 కోట్ల వరకు ఆస్తి ఇచ్చినట్లు శరత్ బాబు ఓ సందర్భంలో అన్నారు. రమాప్రభతో విడిపోయిన తర్వాత శరత్ బాబు మరో వివాహం చేసుకున్నారు. కొంతకాలానికి ఆమె నుంచి కూడా శరత్ బాబు విడిపోయారు. 

46

అయితే శరత్ బాబుకి సంతానం లేదు. తన ఆస్తికి వారసుల కోసం శరత్ బాబు చాలా ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన ఆస్తికి వారసులు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో శరత్ బాబు సోదరి సరిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

56
Sarath Babu

తన అన్న మరణాన్ని తలచుకుని సరితా కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు తల్లి తండ్రి మొత్తం శరత్ బాబు అన్నయ్యే అని సరిత తెలిపారు. తన కొడుకుని చదివించింది అన్నయ్యే. అలాగే తన కుమార్తెకి పెళ్లి కూడా చేశారు. చివరగా అన్నయ్య తన కుమార్తె సోనియా డెలివరీ కోసం బెంగుళూరు వచ్చారు. సోనియాని దత్తత తీసుకుంటాను అని అన్నయ్య చాలా సార్లు నాతో అన్నారు. కనై నేను నవ్వేసి ఊరుకునేదాన్ని. 

66

తన కుమార్తెని దత్తత తీసుకోవాలనే ఆలోచన అన్నయ్యకి ఉన్నప్పటికీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఇప్పుడు అన్నయ్య ఆస్తికి వారసులు ఎవరు అంటే నా దగ్గర సమాధానం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల గురించి నాకు తెలియదు అని సరిత అన్నారు. 

click me!

Recommended Stories