
బాలీవుడ్ సెలబ్రిటీలు ఖాళీ టైమ్ దొరికితే చాలు వెకేషన్‌లోకి వెళ్లిపోతారు. మైండ్ రిఫ్రెష్‌మెంట్, బాడీ రిఫ్రెష్‌మెంట్ చేసుకుని వస్తారు. రెట్టింపు ఎనర్జీతో వస్తుంటారు. అందులో భాగంగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ కిడ్, సైఫ్ అలీ ఖాన్ తనయ, హీరోయిన్ సారా అలీ ఖాన్ వెకేషన్‌కి వెళ్లింది. తన ఫ్రెండ్స్ తో కలిసి రిలాక్స్ అవుతూ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది. అందులో భాగంగా సారా అలీ ఖాన్ బికినీలో సందడి చేసింది. బ్లూ డామినేటెడ్ మల్టీ కలర్ బికినీలో కనువిందు చేస్తుంది. సముద్రంలో జలకాలాడుతూ ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. నెటిజన్లకి ఉక్కపోత పెంచుతున్నాయి. ఓవరాల్‌గా కనువిందు చేస్తున్నాయి. Sara Ali Khan Bikini Photos.
అయితే అభిమానులు మాత్రం సారా అలీ ఖాన్ అసలైన అందాలను చూసి రెచ్చిపోతున్నారు. ఆమె అందాన్ని తమదైన స్టయిల్‌లో వర్ణిస్తూ కామెంట్లు పెడుతున్నారు. సముద్రంలో ఉండాల్సిన షార్క్ ఫిష్ బయటకు వచ్చిన వేళ అంటూ, షార్క్ ఫిష్ బికినీ వేస్తే ఇలానే ఉంటుందేమో అని, అసలైన అందాలతో కనువిందు చేస్తున్న సారా అంటూ కామెంట్ చేస్తున్నారు. సారా ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
సారా అలీఖాన్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ వెకేషన్‌కి వెళ్లింది. అక్కడ ఫ్రెండ్‌తోపాటు సారా అలీ ఖాన్ ఇచ్చిన పోజులు నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి. డబుల్ ఆఫర్‌లా ఒక అందానికి మరో అందం ఫ్రీ అనేట్టుగా ఫ్రెండ్ కూడా బికినీలో కనువిందు చేస్తుండటంతో నెటిజన్లు పండగ చేసుకున్నారు. ఈ స్టార్ బేబీకి వెకేషన్ ఎంజాయ్ మెంట్‌ని ఇస్తుంటే, అభిమానులకు మాత్రమే అందాల విందునిస్తుందని అంటున్నారు నెటిజన్లు.
సారా అలీ ఖాన్.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయ అనే విషయం తెలిసిందే. సైఫ్ మొదటి భార్య అమృత సింగ్‌లకు జన్మించింది సారా. అయితే తండ్రి బాటలోనే నటన వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. స్టార్ కిడ్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ప్రారంభం నుంచి తన ప్రత్యేకతని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ విషయంలో సారా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. రెగ్యూలర్ కమర్షియల్ హీరోయిన్ మాదిరిగానే సారా సైతం స్కిన్ షో విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. స్టార్ కిడ్ అనే దానికి ఎప్పుడో ఫుల్‌స్టాప్ పెట్టింది సారా.
తాను నటించే సినిమాల్లోనూ గ్లామర్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మరోవైపు సోషల్ మీడియాతో తన హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ పాపులర్ అయ్యింది. నెటిజన్లకి దగ్గరయ్యింది. బ్యాక్ టూ బ్యాక్ తన ఫోటో షూట్ పిక్స్ పంచుకుంటూ ఫ్యాన్స్ కి టచ్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
సారా అలీ ఖాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ప్రస్తుతం ఆమెకి ఇన్‌స్టాలో ఏకంగా 37 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం విశేషం. 3.7కోట్ల మంది ఆమెని చూస్తున్నారు. ఆమె పెట్టే ప్రతి పోస్ట్ ని చూస్తున్నారు. తెలుగులో ఈ స్థాయిలో ఫాలోయింగ్ మరే హీరోయిన్‌కి కూడా లేకపోవడం గమనార్హం. తెలుగు స్టార్ హీరోయిన్లు కూడా 20 మిలియన్ల లోపే ఉన్నారంటే సారా రేంజ్ ఫాలోయింగ్ ఏంటో తెలుసుకోవచ్చు.
నిత్యం వెకేషన్ పిక్స్ ని, అందాలను ఆరబోస్తూ నిర్వహించే ఫోటో షూట్ పిక్స్ ని ఇన్‌స్టాలో పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటుందీ సెక్సీ అందాల సోయగం. మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడల్లా వారికితో చాట్ చేస్తూ మరింత దగ్గరవుతుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని ముందుగా అభిమానులతోనే షేర్ చేసుకుంటుంది. అందుకే ఈ బ్యూటీ ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందని అంటున్నారు క్రిటిక్స్.
సారా అలీ ఖాన్ 2018లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. `కేదార్‌నాథ్` చిత్రంతో ఆమె బాలీవుడ్ తెరకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఇందులో గతేడాది మరణించిన యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో జోడి కట్టింది. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది సారా అలీ ఖాన్. ఇందులో తన నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వరించింది.
మరోవైపు రెండో చిత్రమే స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో జోడీ కట్టింది. `సింబా`లో నటించింది. ఇది తెలుగులో వచ్చిన `టెంపర్`కి రీమేక్ కావడం విశేషం. ఇందులో రణ్‌వీర్‌కి లవ్ ఇంట్రెస్ట్ గా గ్లామర్ పాత్రలో కనిపించి అందాల విందుని వడ్డించింది. గ్లామర్ పరంగా రెచ్చిపోయింది. దీంతో తనకంటూ ఓ గుర్తింపు వచ్చేసింది. గతేడాది నటించిన `లవ్ ఆజ్ కల్`, `కూలీ నెం.1` చిత్రాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రాల విజయాలు సారా అలీ ఖాన్ రేంజ్‌నే మార్చేశాయి. ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేశాయి. వరుసగా నాలుగు విజయాలతో సారా స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.
సైఫ్ అలీ ఖాన్ కూతురు అనే ట్యాగ్‌కి ఎప్పుడే బ్రేకులు వేసుకుంది సారా. తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. తనే ఓ స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుంది. సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం సారా అక్షయ్ కుమార్, ధనుష్‌లతో కలిసి `అట్రాంగి రే` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ధనుష్‌కి జోడీగా సారా కనిపించబోతుండటం విశేషం. ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది.