మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్, సంతోషం పట్టలేకపోతున్న సంజనా గల్రాని

Published : May 21, 2022, 11:59 AM ISTUpdated : May 21, 2022, 12:03 PM IST

హీరోయిన్  సంజనా గుడ్ న్యూస్ తెలిపింది.తనకు పండండి మగబిడ్డ జన్మించాడంటూ ఆనందంతో ప్రకటించింది. తన కుటుంబంలో సంతోషలు వెల్లివిరుస్తున్నాయంటుంది బ్యూటీ.   

PREV
16
మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్,  సంతోషం పట్టలేకపోతున్న సంజనా గల్రాని

కన్నడ,తెలుగు ఇండస్ట్రీలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంజనా గల్రానీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ రీతూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 

26

తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు డాక్టర్లు. అంతే కాదు సంజనతో కలిసిఉన్నసెల్ఫీని కూడా ఈ పోస్ట్ కు జతచేశారు. . ఈ విషయం తెలిసిన వెంటనే సంజనకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 

36

2020 లాక్ డౌన్ సమయంలో సంజన పెళ్లి చేసుకుంది. బెంగళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని మతాంతర వివాహం చేసుకుంది బ్యూటీ. ఆ తరువాత ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయ్యింది

46

తెలుగులో సోగ్గాడు సినిమాతో  సంజన పరిచయం అయింది. ఆ తర్వాత ముగ్గురు, యమహో యమః', లవ్ యూ బంగారం, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో మెరిసింది. ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో సంజనాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలు త్రిష చెల్లెలిగా సెకండ్ హీరోయిన్ పాత్రలో ఆమె కనిపించింది. 
 

56

కన్నడ పరిశ్రమ నుంచి రకరకాల వివాదాలు ఏదుర్కొన్న నటిగా సంజన పాపులర్ అయ్యింది. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యింది కూడా. అంతే కాదు గతంలో కూడా రకరకాల వివాదాలతో సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్స్ ఫేస్ చేసింది నిక్కీ గల్రాని. 
 

66

ప్రస్తుతం వివాదాలకు పుల్ స్టాప్ పెట్టి ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది సంజనా గల్రాని. సినిమాలు కూడా పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుసోంది. 

click me!

Recommended Stories