నాట్య మయూరిలా మైమరిపిస్తున్న విష్ణుప్రియ డాన్స్.. స్లీవ్ లెస్ డ్రెస్ లో బుల్లితెర బ్యూటీ వీకెండ్ ట్రీట్అదుర్స్

Published : May 21, 2022, 11:11 AM ISTUpdated : May 21, 2022, 11:19 AM IST

బుల్లితెర బ్యూటీ, అందాల యాంకర్ విష్ణు ప్రియ (Vishnu Priya) గత కొద్దిరోజులుగా గ్లామర్ డోస్ పెంచుతూ అదిరిపోయే డాన్స్ తో  అభిమానులను ఖుషీ చేస్తోంది. తాజాగా మరోసారి మయూరిలా నాట్యమడుతూ అందాలు ఆరబోసింది.   

PREV
18
నాట్య మయూరిలా మైమరిపిస్తున్న విష్ణుప్రియ డాన్స్.. స్లీవ్ లెస్ డ్రెస్ లో బుల్లితెర బ్యూటీ వీకెండ్ ట్రీట్అదుర్స్

హాట్‌ యాంకర్‌ విష్ణు ప్రియా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటోంది. తన అభిమానులను, ఫాలోవర్స్ ను పలు రకాలు సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా విష్ణుప్రియ దగ్గరి నుంచి అభిమానులు కోరుకునేది డాన్స్. 
 

28

విష్ణు ప్రియ నిజానికి మంచి డాన్సర్ అనే చెప్పాలి. అందులో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను అలరించడంలో ఈ బ్యూటీ స్టైలే వేరు. గతంలో ఈటీవీ ప్రసారమైన‘సరైనోళ్లు’, దసరా బుల్లోడు, తారా జువ్వాలు వంటి ఈవెంట్స్ లలో ఈ అందాల యాంకర్ గ్లామర్ స్టెప్పులకు అందరూ షాక్ అయ్యారు. 
 

38

అద్భుతంగా డాన్స్ చేస్తూ టెలివిజన్ ప్రేక్షకులను అలరించి మరింత పాపులర్ అయ్యింది యాంకర్ విష్ణుప్రియ. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలో నిర్వహించిన ఓ ఈవెంట్ లో ప్రపంచాన్ని షేక్ చేసిన ‘ఊ అంటావా.. మావ’ సాంగ్ కు సమంతను మించిపోయి ఆడింది. అదే అవుట్ ఫిట్స్ లో అందాలు ఆరబోసింది. ఇప్పటికీ ఆ డాన్స్ ట్రెండ్ అవుతూనే ఉంటోంది.
 

48

ఇదీగాక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ హాట్ డాన్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పొట్టి దుస్తుల్లో అందాల విందు చేస్తూ కుర్రాళ్లలను తనవైపు తిప్పుకుంటోంది. ఫాస్ట్ బీట్ సాంగ్స్ కూ అదిరిపోయే స్టెప్పులేస్తూ గ్లామర్ ఒళకబోస్తోంది.
 

58

తాజాగా అందాల యాంకర్ యూట్యూబ్ షార్ట్స్ లో ఓ డాన్స్ వీడియోను అప్ లోడ్ చేసింది. ట్రెడిషనల్ వేర్ లో ఈ ముద్దుగుమ్మ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘గురు’చిత్రంలోని ఓ మిలోడీ బిట్ కు చక్కగా డాన్స్ చేసింది. ఓ పక్క గ్లామర్ విందు చేస్తూనే మరోపక్క మయూరిలా డాన్స్ చేసి ఆకట్టుకుంది.
 

68

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ షార్ట్స్ లో దూసుకెళ్లోంది. యాంకర్ అందాలను నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీంతో లైక్ లు, కామెంట్లతో విష్ణు ప్రియా డాన్స్ కు మద్దతు తెలుపుతున్నారు.  మరికొందరు తన డాన్స్ ను రీల్ ను షేర్ చేస్తూ బుల్లితెర బ్యూటీని మరింత పాపులర్ చేస్తున్నారు. 
 
 

78

విష్ణుప్రియ తన యాక్టింగ్ కేరీర్ ను 2005లోనే స్టార్ట్ చేసింది. మాలయాళ చిత్రం ‘మయూకమ్’తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘శివపతిగరమ్’ చిత్రంతో తమిళంలో అడుగుపెట్టింది. అలాగే తెలుగులో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘యమదొంగ’ చిత్రంతో చిన్న పాత్ర కనిపించింది.
 

88

ఇక బుల్లితెరపై `పోరా పోవే` షోతో పాపులర్‌ అయ్యింది విష్ణు ప్రియా. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)తో కలిసి షోను సక్సెస్ ఫుల్ గా రన్ చేసింది. ఆ తర్వాత `బొమ్మ అదిరింది`లోనూ కనువిందు చేసింది. దీంతోపాటు అడపాదడపా `జబర్దస్త్`లో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మెరుస్తుంది. `కామెడీ స్టార్స్` లోనూ తళుక్కున్న మెరుస్తూ కనువిందు చేస్తోంది. చివరిగా ‘చెక్ మేట్’ చిత్రంలో నటించింది.

click me!

Recommended Stories